Ladakh: కార్గిల్ జిల్లా ద్రాస్ ప్రాంతంలో జరిగిన ఓ మిస్టరీ పేలుడులో ముగ్గ‌రు ప్రాణాలు కోల్పోగా, మ‌రో పది మందికి గాయాలయ్యాయి. కబడ్డీ నల్లాలో స్క్రాప్ షాపులో శుక్రవారం జరిగిన పేలుడులో ముగ్గ‌రు వ్యక్తులు మరణించగా, మరో పది మందికి గాయాలైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

Mysterious Blast At Scrap Shop In Kargil region: కార్గిల్ జిల్లా ద్రాస్ ప్రాంతంలో జరిగిన ఓ మిస్టరీ పేలుడులో ముగ్గ‌రు ప్రాణాలు కోల్పోగా, మ‌రో పది మందికి గాయాలయ్యాయి. కబడ్డీ నల్లాలో స్క్రాప్ షాపులో శుక్రవారం జరిగిన పేలుడులో ముగ్గ‌రు వ్యక్తులు మరణించగా, మరో పది మందికి గాయాలైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన లడఖ్‌లోని కార్గిల్ ప్రాంతంలోని ద్రాస్ పట్టణంలో స్క్రాప్ షాప్ లో జరిగిన పేలుడులో ముగ్గురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. "కార్గిల్ లోని ద్రాస్ పట్టణంలోని కబడ్డీ నల్లాలోని స్క్రాప్ సైట్ వద్ద జరిగిన పేలుడులో ముగ్గురు మృతి చెందగా, ప‌లువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఎస్డీహెచ్ ద్రాస్ కు తరలించాం' అని కార్గిల్ ఎస్ఎస్పీ అనాయత్ అలీ చౌదరి ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

పేలుడు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి పోలీసు బృందాన్ని పంపించి వాస్తవాలు తెలుసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేయ‌డంతో పాటు దర్యాప్తు కొనసాగిస్తున్నామ‌ని ఒక‌ పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన వ్యక్తులను ఇంకా గుర్తించాల్సి ఉంది. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా, ద్రాస్ లోని స్క్రాప్ షాప్ వద్ద జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం, కార్గిల్ పోలీసులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీసీ కార్గిల్, ఎస్ఎస్పి కార్గిల్ జిల్లా ఆసుపత్రి కార్గిల్ కుర్బతాంగ్ ను సందర్శించి క్షతగాత్రుల పరిస్థితి గురించి ఆరా తీశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సీఎంవో కార్గిల్ ను డీసీ ఆదేశించారు. రెడ్ క్రాస్ నిధుల కింద మృతుల కుటుంబాలకు మరింత మధ్యంతర ఉపశమనం కల్పిస్తున్నారు.

Scroll to load tweet…