కేరళలోని ఎంఈఎస్‌ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కోజికోడ్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలను నిర్వహిస్తున్న ఎంఈఎస్ తమ ఆధ్వర్యంలో నడుస్తున్న 150 విద్యాసంస్ధల్లో విద్యార్ధినులు ముసుగు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది.

ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఈ సంప్రదాయాన్ని ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దీనిని అనుసరిస్తున్నారు. దాదాపు లక్షమంది విద్యార్ధులు ఎంఈఎస్ సొసైటీ విద్యాసంస్థల్లో చదువుతున్నారు.

తమ కళాశాలలకు, పాఠశాలలకు వచ్చే అమ్మాయిలు ముసుగులు ధరించడానికి, ముఖం కప్పుకోవడానికి వీలు లేదని సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నిర్ణయంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. ఇక్కడ చదువుకుంటున్న వారిలో మెజారిటీ విద్యార్ధులు ముస్లింలే. దీంతో ఎంఈఎస్ ట్రస్ట్ అధ్యక్షుడు ఫజల్‌గపూర్ స్పందించారు. తాము వివాదాస్పద నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఈ ఆర్ధిక సంవత్సరం నుంచ తరగతులకు వచ్చే అమ్మాయిలు ముఖాన్ని ముసుగుతో కప్పుకోరాదన్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తామని ప్రకటించారు. హైకోర్టు ఆదేశాల మేరకు డ్రెస్ కోడ్‌పై కాలేజ్ మేనేజ్‌మెంట్‌దే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.