నాలుగంతస్తుల భవనం కుప్పకూలి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ముంబయిలోని బాండ్రా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో... నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా... గాయపడిన నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు బాండ్రా ఎమ్మెల్యే జీషాన్ సిద్ధిఖీ తెలిపారు.

భవనం కూలిన ఘటన తెలిసిన వెంటనే  పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి  చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా.. సహాయక చర్యల్లో స్థానికులు కూడా పాల్గొనడం గమనార్హం. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.