చారిటీ ఇనిస్టిట్యూట్ నడుపుతూ... అందులో చదువుకోవడానికి వచ్చిన బ్రెజిల్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. కాగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయికి చెందిన పద్మాకర్ నందేకర్(52) ముంబయిలో చారిటబుల్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. కాగా.. అందులో యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ నేర్చుకునేందుకు బ్రెజిల్ నుంచి 19ఏళ్ల ఓ యువతి వచ్చింది. కాగా.. యువతిపై పద్మాకర్ కన్నుపడింది.

పథకం ప్రకారం..గత నెల 15వ తేదీన పద్మాకర్ నందేకర్ యువతిని డిన్నర్ కోసం ఓ హోటల్ కి ఆహ్వానించాడు. ఆమె వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి భోజనం చేశారు. తర్వాత ఆమెకు నందేకర్ ఓ డ్రింక్ ఆఫర్ చేశాడు. అందులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆమె ఆ డ్రింక్ తాగి స్పృహ కోల్పోయింది.

మత్తులో పడి ఉన్న ఆమెను హోటల్ గదికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం లేచి చూశాక... ఆమెకు తాను అత్యాచారానికి గురైన విషయం గ్రహించింది.  వెంటనే ఆమె అక్కడి నుంచి తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయాన్ని ఇటీవల యువతి తన బంధువుకి తెలియజేయగా... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు.