అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స ఇవ్వాల్సిన వైద్యుడు... ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. మహిళా రోగికి మత్తు మందు ఎక్కించి... ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దానంతటినీ వీడియో తీసి.. ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ముంబయి నగరంలోని జోగేశ్వరి ఈస్ట్ ప్రాంతానికి చెందిన 27ఏళ్ల మహిళ గత కొంతకాలంగా పైల్స్ సమస్యతో బాధపడుతోంది. దీంతో... ఆమె చికిత్స కోసం అదే ప్రాంతంలో ఉన్న డాక్టర్ వంశరాజ్ ద్వివేది కల్ిన్ కి 2015లొ మే 28వ తేదీన వచ్చింది. చికిత్స చేస్తానని ఆమెను ఆ డాక్టర్ నమ్మించాడు.

ఆ తర్వాత ఆమెకు మత్తు మందు ఇచ్చి... ఆస్పత్రిలోనే నిద్రపోమ్మని చెప్పాడు. ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దానంతటినీ వీడియో తీశాడు.  అనంతరం ఆ వీడియోను మహిళకు పంపించి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని డాక్టర్ డిమాండు చేశాడు. 

తనతో సంబంధం పెట్టుకోకుంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధిత మహిళ మలాద్ కు చెందిన యువకుడితో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా డాక్టర్ ఆమెను బెదిరించాడు. దీంతో బాధిత మహిళ భర్తతో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన డాక్టర్ ద్వివేదిని అరెస్టు చేశారు.