Mukesh Ambani: భారతదేశపు అత్యంత సంపన్నుడు,  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత‌.. ముఖేష్ అంబానీ రూ. 13.14 కోట్ల విలువైన New Rolls Royce Cullinan కొనుగోలు చేశారు. దేశంలోనే అత్యంత ఖరీదైన కార్ల  రిజిస్టేష‌న్ జనవరి 31న దక్షిణ ముంబైలోని టార్డియో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో RIL పేరు మీద రిజిస్టర్ అయిన‌ట్టు ఆర్టీఓ అధికారులు తెలిపారు.   

Mukesh Ambani: ప్రపంచ అపరకుబేరుల్లో ఒకరైన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.. ప్రపంచంలోనే విలాసవంతమైన కారులు తయారు చేసే “రోల్స్ రోయ్స్(Rolls Royce) ” సంస్థ తయారు చేసిన “కల్లినాన్(Cullinan)” అనే కారును సొంతం చేసుకున్నారు. ముకేశ్ అంబానీ.. తన అభిరుచికి తగ్గట్టుగా ప్రత్యేకంగా తయారు చేయించారట. ఈ అల్ట్రా లగ్జరీ Rolls Royce Cullinan ధ‌ర రూ. 13.14 కోట్లు.

అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ Cullinan.. జనవరి 31న దక్షిణ ముంబైలోని టార్డియో ప్రాంతీయ రవాణా కార్యాలయంలో రిలయన్స్ సంస్థ పేరుమీద రిజిస్టర్ అయిన‌ట్టు ఆర్టీఓ అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యంత విలువైన, ఖ‌రీదైన కారు అని ఆర్టీఓ అధికారులు తెలిపారు. 

ఇండియాలో ఈ కారును 2018లో లాంచ్ చేశారు. దాని బేస్ ప్రైజ్ 6.95 కోట్లు. కానీ, అంబానీ తనకు తగ్గట్లుగా మార్పులు చేయించుకోవడంతో ఆ ధర రూ.13.14 కోట్లకు చేరింది. కారుకు రోడ్డు ట్యాక్సే ఏకంగా రూ.20 లక్షలు, అదనంగా రోడ్ సేఫ్టీ టాక్స్ మరో రూ.40 వేలు చెల్లించారట‌. అలాగే..వీఐపీ నెంబ‌ర్ కోసం రిల‌య‌న్స్ సంస్థ అద‌నంగా 12 ల‌క్ష‌లు క‌ట్టిన‌ట్లు అధికారులు తెలిపారు. 0001 నెంబ‌ర్‌ను ఆ కారుకు కేటాయించిన‌ట్లు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. 

Rolls Royce Cullinan, రోడ్డు మీద కదిలే రాజసౌధం ఇప్పటివరకూ వచ్చిన SUV కార్ల అన్నింటికీ రారాజు. ఈ కారుకు ఎన్నో విశేషాలు, మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Rolls-Royce Cullinan ప్రత్యేకతలు:

ఇంజిన్ సామర్థ్యం - 6751 CC

పవర్ - 563 bhp@5000 rpm

టార్క్ - 850 Nm@1600 rpm

మైలేజ్ - లీటరుకు 7 కి.మీ

ఫ్యుయెల్ ట్యాంక్ - పెట్రోల్

గేర్లు - 8

సిలిండర్ల సంఖ్య - 12

గరిష్ట వేగం - గంటకు 250 కి. మీ

5.2 సెకన్లలోనే 0 నుంచి 100 కి. మీ వేగాన్ని అందుకోగలదు.