త్వరలోనే  ఎంపీల సీట్లు  పెరగనున్నాయని  ప్రధాని  నరేంద్ర మోడీ  పేర్కొన్నారు.  కొత్త  పార్లమెంట్  భవనం  ప్రారంభోత్సవ  కార్యక్రమంలో  ప్రధాని  ఈ వ్యాఖ్యలు  చేశారు. 

న్యూఢిల్లీ: త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయని ప్రధాని మోడీ తెలిపారు.కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారంనాడు పారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.పాత పార్లమెంట్ లో సాంకేతిక సమస్యలున్నాయని మోడీ గుర్తు చేశారు. ఎంపీలకు తగినన్ని సీట్లు కూడా లేవన్నారు. త్వరలో ఎంపీ సీట్లు పెరిగితే పాత పార్లమెంట్ లో సభ్యులు కూర్చొనే పరిస్థితి లేదన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో 888 మంది సభ్యులు కూర్చొనే సామర్ధ్యం ఉంది. రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజనతో ఎంపీ సీట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. భవిష్యత్తులో పెరిగే ఎంపీల సంఖ్యకు అనుగుణంగా కొత్త పార్లమెంట్ భవనంలో సీట్ల సంఖ్య ను ఏర్పాటు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:కొత్త పార్లమెంట్ భవనం కొత్త ప్రజాస్వామ్యానికి దేవాలయం: మోడీ

ఎంపీ సీట్ల పెంపుదల పెరుగుదలపై డిలీమిటేషన్ కమిషన్ ఏర్పాటుపై కేంద్రం దృష్టి కేంద్రీకరించింది.1973 లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎంపీ సీట్ల సంఖ్యను 524 నుండి 545కు పెంచారు.1976లో 25 ఏళ్ల పాటు ఎంపీ సీట్ల సంఖ్య పెంపును స్థంభింప చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 201లో కూడా 25 ఏళ్ల పాటు ఎంపీల సంఖ్యను స్థంభింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2026 కొత్త డిలిమీటేషన్ కమిషన్ ఏర్పాటు కావాల్సి ఉంది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలు డీలిమిటేషన్ లో నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.