న్యూఢిల్లీ: ముంబైలోని అమరజ్యోతి స్మారకాన్ని విధ్వంసాన్ని చేసిన వారిని గుర్తించేందుకు సహాయం చేసిన వారికి రూ. 5 లక్షల రివార్డు అందింది.

ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ముంబై పోలీస్ కమిషనర్ డాక్టర్ సత్యపాల్ సింగ్ కు ఈ చెక్ ను అందించారు. ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ తరపున ఆయన ప్రతినిధి కెకి బాపునా ఈ చెక్ ను అందించారు.

ఈ సందర్భంగా ముంబై పోలీస్ కమిషనర్ కు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఓ లేఖను రాశాడు.దేశభక్తి, ధైర్యం,జాతి ఆదర్శాలకు విలువనిచ్చే పౌరులందరి గౌరవాన్ని పోలీసు బలగం సంపాదించిందన్నారు.

ఈ స్మారకాన్ని విధ్వంసం చేసిన వారిని గుర్తించేందుకు భాద్యులైన పోలీసు బృందానికి ఈ రివార్డును అందించాలని ఆయన ఆ లేఖలో కోరారు.అమర్ జవాన్ జ్యోతి స్మార చిహ్నాన్ని విధ్వంసం చేసిన వారిని సమాచారం ఇచ్చిన వారికి రూ. 5 లక్షల ఇస్తానని ఎంపీ ప్రకటించిన విషయం తెలిసిందే.