Hijab Row: దేశ అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల అభిప్రాయాలను పట్టించుకోమన్నారు. డ్రెస్ కోడ్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కర్నాటక రాష్ట్రంలో తలెత్తిన డ్రెస్ కోడ్ వివాదం ప్రస్తుతం ఆ రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉందని అమెరికా రాయబారి కామెంట్ పై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి కౌంటర్ ఇచ్చారు.
Hijab Row: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. క్రమంగా ప్రపంచవ్యాప్తం అవుతోంది. ఈ వివాదంతో విద్యార్థులు హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. దీంతో విద్యాసంస్థలు మూడురోజులపాటు సెలవులు ప్రకటించారు. మొత్తానికి హిజాబ్ వివాదం చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉందని ప్రజల్లో భయాందోళనలు వెంటాడుతున్నాయి.
అటు, ఈ వివాదాన్ని మరి పెద్దదిగా చూడోద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు సైతం హెచ్చరించింది. భావోద్వేగాలతో పనిలేదని, రాజ్యాంగంతోనే పనేనని, రాజ్యాంగం ఎలా నిర్ణయం తీసుకోవాలో..అలాగే తీసుకుంటామని స్పష్టం చేసింది.
తాజాగా వివాదంపై అమెరికా కామెంట్ చేసింది. హిజాబ్ వివాదం పై న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో.. అంతర్గత సమస్యలపై ప్రేరేపిత వ్యాఖ్యలను స్వాగతించబోమని భారత్ పేర్కొంది. అమెరికా, తదితర దేశాలకు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
మీడియా ప్రశ్నలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ.. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోందని, పరిపాలన, ప్రజాస్వామిక అంశాలకు సంబంధించిన సమస్యలను భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి పరిశీలించి, పరిష్కరిస్తుందన్నారు. భారత దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఇండియా గురించి పూర్తిగా తెలిసినవారే ఈ విషయాలను మెచ్చుకుంటారని, అంతర్గత అంశాలపై అనుచిత వ్యాఖ్యలను స్వాగతించడంలేదని అరిందం తన ట్వీట్‌లో తెలిపారు.
ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంబాసిడర్ రాషద్ హుస్సేన్ ఆ అంశంపై ఓ ట్వీట్ చేశారు. స్కూళ్లలో హిజబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అని ట్వీట్ ల్ పేర్కొన్నారు. హుస్సేన్‌ను గత ఏడాది డిసెంబర్‌లో US సెనేట్ IRF కోసం అంబాసిడర్-ఎట్-లార్జ్‌గా నియమించింది. అతను IRF తొలి ముస్లిం రాయబారి. అతను గతంలో ఒబామా పరిపాలనలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌కు ప్రత్యేక ప్రతినిధిగా పని చేయడంతో పాటు US ప్రభుత్వంలో అనేక ఉన్నత స్థాయి పదవులను నిర్వహించారు. అయితే రాషద్ చేసిన కామెంట్‌కు భారత్ తీవ్రంగా ఖండించింది. వక్రబుద్ధితో చేసిన వ్యాఖ్యలను స్వాగతించడం లేదని ఇవాళ విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి ఓ ట్వీట్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.
