ముంబై : తల్లిని హత్య చేసి కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడు  వెంకటేశ్వరన్ తన లాప్‌టాప్‌లో సూసైడ్ నోటు‌ను రాశాడు.

మహారాష్ట్రలోని ముంబైలో గల మీరా రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో  కొడుకుతో కలిసి తల్లి నివాసం ఉంటుంది.  రెండేళ్ల నుండి  వెంకటేశ్వరన్ గోపాల్ అయ్యర్ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. 

ఆ ఫ్లాట్‌లో వాళ్లు నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం నాడు ఈ ఫ్లాట్ నుండి ఎవరూ కూడ బయలకు రాలేదు.  అంతేకాదు  ఫ్లాట్ నుండి దుర్వాసన కూడ వచ్చింది.  దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఫ్టాట్‌ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చూస్తే వెంకటేశ్వరన్ గోపాల్ తల్లి రక్తపు మడుగులో ఉంది. బెడ్‌రూమ్‌లో వెంకటేశ్వరన్  అయ్యర్ మృతదేహాం కన్పించింది. అయ్యర్ తన లాప్‌టాప్‌లో సూసైడ్ లేఖను రాసిపెట్టాడు.  ఈ మరణాలకు గల కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.