కన్న తల్లే... కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీసేసింది. బిడ్డలను పెట్టెలో పెట్టి తాళం వేసిందో తల్లి. దీంతో... ఊపిరాడక చిన్నారులు ఇద్దరూ కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భదోహీలోని ఖమారియా ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖమారియా ప్రాంతానికి చెందిన  ఓ వ్యక్తి పరిశ్రమలో పనిచేస్తాడు. వీరికి ఇద్దరు చిన్నారులు. ఆయన గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికొచ్చేసరికి పాప హతైనా (6), బాబు హసన్‌ (3)లు కనిపించలేదు. 

అనంతరం ఓ పెట్టెలో అపస్మారక స్థితిలో ఆ ఇద్దరు చిన్నారులను కనుగొన్న ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మతి స్థిమితం సరిగాలేని స్థితిలోనే ఆ పిల్లల తల్లి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే పిల్లల తల్లిని విచారించిన పోలీసు బృందం మాత్రం ఆమె మానసిక స్థితి సరిగానే ఉన్నట్లు గుర్తించిందని ఎస్పీ తెలిపారు.