రాను రాను పేగుబంధానికి విలువు లేకుండా పోతుంది. బిడ్డకు ఏమైనా అయితే మాతృహృదయం సహించలేదంటారు...కానీ హర్యానాలో ఓ తల్లి కన్నకొడుకు పట్ల కృరంగా ప్రవర్తించింది. 

హర్యానా : రాను రాను పేగుబంధానికి విలువు లేకుండా పోతుంది. బిడ్డకు ఏమైనా అయితే మాతృహృదయం సహించలేదంటారు...కానీ హర్యానాలో ఓ తల్లి కన్నకొడుకు పట్ల కృరంగా ప్రవర్తించింది. పసికందు అని కూడా చూడకుండా గొడ్డును బాదినట్లు బాదుతుంది. రోదిస్తున్నాసరే పట్టించుకోకుండా ఆ పసికందు కడుపులో తన్నుతూ పశువులా ప్రవర్తించింది. 

ఈ హృదయ విచారకర ఘటన హర్యానాలోని సిరసాల్లో చోటు చేసుకుంది. తన కళ్లెదుటే కోడలు మనవడిని హింసించడంతో తల్లడిల్లిన బాలుడి నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నానమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అందరి హృదయాలను కలిచివేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.