రెండేళ్ల పసిబిడ్డపై కన్నతల్లి రాక్షసంగా ప్రవర్తించింది. భర్తపై కోపంతో పసిబిడ్డను చిత్రహింసలు పెట్టింది. బిడ్డను కొడుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి మరి భర్తకు పంపింది. తులసి అనే మహిళ దాదాపు 250 వీడియోలను భర్తకు పంపింది.
రెండేళ్ల పసిబిడ్డపై కన్నతల్లి రాక్షసంగా ప్రవర్తించింది. భర్తపై కోపంతో పసిబిడ్డను చిత్రహింసలు పెట్టింది. బిడ్డను కొడుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి మరి భర్తకు పంపింది. తులసి అనే మహిళ దాదాపు 250 వీడియోలను భర్తకు పంపింది. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా సత్యమంగళం మండలం మెట్టూరులో ఈ ఘటన జరిగింది. కొన్నాళ్లుగా భర్తతో తులసికి గొడవలు జరుగుతున్నాయి. ఆ కోపంతో కన్నబిడ్డను తీవ్రంగా కొట్టింది తులసి. ప్రస్తుతం రెండేళ్ల బాబు పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి తులసిది చిత్తూరు జిల్లా రాంపల్లి కావడంతో ఆమెను పట్టుకోవడానికి పది పోలీసు బృందాలను పంపింది స్టాలిన్ సర్కార్.
