తమిళనాడు తిరువణ్ణామలై లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. జీవితం మీద విరక్తితోనే ఇంత దారుణానికి ఒడిగట్టింది.
తమిళనాడు తిరువణ్ణామలై లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. జీవితం మీద విరక్తితోనే ఇంత దారుణానికి ఒడిగట్టింది.
కణ్ణమంగళం సమీపంలోని అయ్యంపాళ్యంకు చెందిన అరుల్ దాస్ పుష్పలత (27) దంపతులకు కుమారుడు సర్వేష్(2), కుమార్తె సంజన(1) ఉన్నారు. రెండు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన పుష్పలత సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి సమీపంలోని బావిలో ఇద్దరు పిల్లలను తోసి ఆమె కూడా బావిలోకి దూకింది.
దీంతో సర్వేష్, సంజన మృతి చెందారు. పుష్పలత బావిలో ఉన్న మోటారు పైపును పట్టుకుని కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు బావి వద్దకు చేరుకుని పుష్పలతను బైటికి తీశారు. చిన్నారుల మృత దేహాలను బయటకు తీశారు.
విషయం తెలుసుకున్న కణ్ణమంగళం పోలీసులు చిన్నారుల మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే కారణమని తెలిసింది. ఇద్దరు చిన్నారుల మృతదేహాల వద్ద బంధువులు గుండెలవిసేలా విలపించారు.