నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Monday 26th September Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

4:17 PM IST

హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం... కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం

హిమాచల్ ప్రదేశ్ లో టెంపో లోయలోపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనను మరిచిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది. సిర్ మౌర్ జల్లాలో కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో 27ఏళ్ల మహిళతో పాటు ఆమె ముగ్గురు బిడ్డలు, మేనకోడలు వున్నారు. ఈ పిల్లలంతా పదేళ్లలోపువారేనని తెలుస్తోంది. 
 
3:49 PM IST

'డెమోక్రాటిక్ ఆజాద్ పార్టీ' ని స్థాపించిన గులాం నబీ ఆజాద్

ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీ పెట్టారు. 'డెమోక్రాటిక్ ఆజాద్ పార్టీ' ని స్థాపించినట్లు ఆజాద్ ప్రకటించారు. నీలం, తెలుపు, పసుపు రంగలతో కూడిన పార్టీ జెండాను కూడా ఆజాద్ ఆవిష్కరించారు. 

2:43 PM IST

యూపీలో ఘోరం...నీటిగుంటలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్... 9 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో జిల్లాలో 45 మంది ఓ ట్రాక్టర్ పై దేవాలయానికి వెళుతుండగా ట్రాలీ ఒక్కసారిగా అదుపుతప్పి నీటికుంటలో పడిపోయింది. దీంతో 9 మంది అక్కడిక్కడే చనిపోగా మిగతావారు గాయపడ్డారు. 

1:34 PM IST

మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ భామ జాక్వెలిన్ కు ఊరట

మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పాటియాలా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  రూ.50వేల పూచికత్తులో జాక్వెలిన్ కు బెయిలిచ్చింది న్యాయస్థానం.  
 
12:34 PM IST

పాక్ లో కుప్పకూలిన హెలికాప్టర్... ఆరుగురు ఆర్మీ అధికారులు మ‌ృతి

పాకిస్థాన్ లో ఆర్మీ అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు నలుగురు ఆర్మీ అధికారులు మృతిచెందారు. ఈ ప్రమాదం బలోచిస్తాన్ ప్రావిన్స్ లో చోటుచేసుకున్నట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. 
 
11:25 AM IST

మైసూరులో వైభవంగా దసరా వేడుకలు... ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

ప్యాలస్ సిటీ మైసూరులో అంగరంగ వైభవంగా జరిగే దసరా వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా దసరా వేడుకలు జరగలేవు. దీంతో ఈసారి కర్ణాటక సాంస్కృతిక వైభవాన్ని చాటేలా దసరా వేడుకల కోసం మైసూర్ రాజవంశీకులు ఘనంగా ఏర్పాట్లు చేసారు. 

10:42 AM IST

డాలర్= రూ. 81.52 ... మరో 43 పతనమైన రూపాయి విలువ

అంతర్జాతీయ మార్కెట్ లో భారత కరెన్సీ రూపాయి విలువ మరింత పతనమయ్యింది. మరో 43 పైనలు పతనమైన రూపాయి యూఎస్ డాలర్ తో పోలిస్తే 81.52 వద్ద నిలిచింది.
 
10:17 AM IST

హిమాచల్ ప్రదేశ్ ఘోరం... టెంపో లోయలో ముగ్గురు ఐఐటీ స్టూడెంట్స్ మృతి

హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారణాసి ఐఐటీకి చెందిన ముగ్గురు విద్యార్ధులతో సహా మొత్తం 10 మంది చెందారు. ఆదివారం రాత్రి ఓ టెంపో ట్రావెలర్ అదుపుత‌ప్పి లోయలో పడిపోయింది. దీంతో పలువురు మృతిచెందగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. 

Read More  ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డ్డ టెంపో,, ఏడుగురు పర్యాటకుల దుర్మ‌ర‌ణం

9:36 AM IST

భారత్ లో43,415 కు తగ్గిన యాక్టివ్ కరోనా కేసులు...

భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 4,129 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో కరోనాతో 20 మంది మృతిచెందినట్లు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 4,45,72,243 కు చేరితే మరణాల సంఖ్య 5,28,530 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 43,415 యాక్టివ్ కేసులు వున్నట్లు ప్రకటించారు. 

9:25 AM IST

రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయాలు... 92మంది ఎమ్మెల్యేలు రాజీనామా

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి ఎన్నికలతో రాజస్థాన్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపటుతుండగా తదుపరి సీఎంగా సచిన్ పైలట్ వైపు అదిష్టానం మొగ్గుచూపుతోంది. కానీ గెహ్లాట్ మాత్రం తన తనకు అనుకూలంగా వుండేవారికే సీఎం పదవి ఇప్పించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే గెహ్లాట్ వర్గానికి చెందిన 92మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం రాజస్థాన్ కాంగ్రెస్ లో ఒక్కసారిగా కలకలం రేపింది. 

4:17 PM IST:

హిమాచల్ ప్రదేశ్ లో టెంపో లోయలోపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనను మరిచిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది. సిర్ మౌర్ జల్లాలో కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో 27ఏళ్ల మహిళతో పాటు ఆమె ముగ్గురు బిడ్డలు, మేనకోడలు వున్నారు. ఈ పిల్లలంతా పదేళ్లలోపువారేనని తెలుస్తోంది. 
 
3:49 PM IST:

ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీ పెట్టారు. 'డెమోక్రాటిక్ ఆజాద్ పార్టీ' ని స్థాపించినట్లు ఆజాద్ ప్రకటించారు. నీలం, తెలుపు, పసుపు రంగలతో కూడిన పార్టీ జెండాను కూడా ఆజాద్ ఆవిష్కరించారు. 

2:43 PM IST:

ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో జిల్లాలో 45 మంది ఓ ట్రాక్టర్ పై దేవాలయానికి వెళుతుండగా ట్రాలీ ఒక్కసారిగా అదుపుతప్పి నీటికుంటలో పడిపోయింది. దీంతో 9 మంది అక్కడిక్కడే చనిపోగా మిగతావారు గాయపడ్డారు. 

1:34 PM IST:

మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పాటియాలా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  రూ.50వేల పూచికత్తులో జాక్వెలిన్ కు బెయిలిచ్చింది న్యాయస్థానం.  
 
12:34 PM IST:

పాకిస్థాన్ లో ఆర్మీ అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు నలుగురు ఆర్మీ అధికారులు మృతిచెందారు. ఈ ప్రమాదం బలోచిస్తాన్ ప్రావిన్స్ లో చోటుచేసుకున్నట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. 
 
11:25 AM IST:

ప్యాలస్ సిటీ మైసూరులో అంగరంగ వైభవంగా జరిగే దసరా వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా దసరా వేడుకలు జరగలేవు. దీంతో ఈసారి కర్ణాటక సాంస్కృతిక వైభవాన్ని చాటేలా దసరా వేడుకల కోసం మైసూర్ రాజవంశీకులు ఘనంగా ఏర్పాట్లు చేసారు. 

10:42 AM IST:

అంతర్జాతీయ మార్కెట్ లో భారత కరెన్సీ రూపాయి విలువ మరింత పతనమయ్యింది. మరో 43 పైనలు పతనమైన రూపాయి యూఎస్ డాలర్ తో పోలిస్తే 81.52 వద్ద నిలిచింది.
 
11:19 AM IST:

హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారణాసి ఐఐటీకి చెందిన ముగ్గురు విద్యార్ధులతో సహా మొత్తం 10 మంది చెందారు. ఆదివారం రాత్రి ఓ టెంపో ట్రావెలర్ అదుపుత‌ప్పి లోయలో పడిపోయింది. దీంతో పలువురు మృతిచెందగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. 

Read More  ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డ్డ టెంపో,, ఏడుగురు పర్యాటకుల దుర్మ‌ర‌ణం

9:36 AM IST:

భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 4,129 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో కరోనాతో 20 మంది మృతిచెందినట్లు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 4,45,72,243 కు చేరితే మరణాల సంఖ్య 5,28,530 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 43,415 యాక్టివ్ కేసులు వున్నట్లు ప్రకటించారు. 

9:25 AM IST: