Asianet News TeluguAsianet News Telugu

యూపీ బ్లాక్ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం: మోడీ అభినందన

త్వరలో యూపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బ్లాక్ పంచాయితీ చీఫ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయంపై మోడీ పార్టీ కార్యకర్తలను అభినందించారు. యూపీ సీఎం అమలు చేసిన పథకాలతో ప్రజలు పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.

modi congratulates to Bjp workers for victory in Block panchayat elections in Uttarpradesh
Author
New Delhi, First Published Jul 10, 2021, 9:08 PM IST

న్యూఢిల్లీ:  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  జరిగిన బ్లాక్ పంచాయితీ ఎన్నికల్లో  బీజేపీ భారీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ  హర్షం వ్యక్తం చేశారు. యూపీ రాష్ట్రంలో బ్లాక్ పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

యోగి ఆదిత్యనాథ్ సర్కార్  ప్రవేశపెట్టిన ప్రజా ప్రయోజన పథకాల ద్వారా ప్రజాలకు లభించిన ప్రయోజనాలతో రాష్ట్రంలో పార్టీకి భారీ విజయాన్ని సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు.  పార్టీ కార్యకర్తలంతా ఈ విజయానికి అభినందనలకు అర్హులేనని ఆయన చెప్పారు.

ఇవాళ  బ్లాక్ పంచాయితీ చీఫ్ ఎన్నికలు జరిగాయి. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. కడపటి వార్తలు అందే సమయానికి  కనౌజ్, లక్నో ల్లో 8 బ్లాకుల్లో 6 స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది.  సీతాపూర్ లో 19 స్థానాల్లో 15 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఎస్పీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ముజఫర్ నగర్ లో  9 స్థానాల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది.  మరో స్థానంలో ఆర్‌ఎల్డీ విజయం సాధించింది.అజంఘర్ లో 12 స్థానాలను బీజేపీ గెలుచుకొంది.

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios