కర్ణాటకలో సేడం ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిట్ తెల్కూర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాడు. ఓ మహిళ తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని విధాన సౌధ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశాడు. అయితే ఆ మహిళ మాత్రం ఎమ్మెల్యేనే తనను మోసం చేశాడని.. దీనిమీద న్యాయపరంగా పోరాడతానంటోంది.. వివరాల్లోకి వెడితే..  

బెంగళూరు : తనకు పుట్టిన బిడ్డకు నీవే తండ్రివి రెండు కోట్ల రూపాయల Compensation కోరుతూ ఓ woman తనను నిత్యం సతాయిస్తున్నట్లు కలబురగి జిల్లా సేదం విధానసభ నియోజకవర్గ ఎమ్మెల్యే rajkumar patil telkur (బిజెపి) విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెను విచారించారు. తనను అక్రమంగా బంధించారు అంటూ బాధితురాలు ఆరోపించింది.

2009లో ఆమెతో పరిచయం అయిందని.. 2013లో ఓ సారి కలిసి భూవివాదాన్ని పరిష్కరించాలని కోరినట్లు Legislator వివరించాడు. ఆపై మరోసారి.. కుమారుడు చదువు కోసం సహాయం చేయాలని కోరినట్లు తెలిపారు. 2018లోనే Social mediaల్లో చెడ్డగా సమాచారం ప్రచారం చేసినట్లు ఆరోపించారు. National Commission for Womenకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి, నగదు కోసం డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. 

2021 మార్చిలో కలిసి డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి తెచ్చారని, ఇప్పుడు శాసనసభ్యుడి వల్ల తనకు బిడ్డ కలిగినట్లు నింద మోపుతూ, అ బిడ్డ సంరక్షణ కోసం రూ.రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ వ్యతిరేకులతో ఆ మహిళ చేతులు కలిపి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు సతాయింపు..
కాగా, సేలం ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిట్ తెల్కూర్ తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్న బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన పోలీసులే వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బెంగళూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కుశల స్వామి విలేకరులతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి బొమ్మైకి తన కష్టాన్ని చెప్పుకొని, ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ విధాన సౌధ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆమెను హౌస్ అరెస్టు చేశారని ఆరోపించారు.

విధి లేక ఆమె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని చెప్పారు. పలువురు బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు.. యువతులు, మహిళలపై లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడినా ముఖ్యమంత్రి, హోం మంత్రి ఇప్పటివరకు స్పందించలేదని విమర్శించారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా సంఘాలు మద్దతుగా నిలబడాలని ఆమె డిమాండ్ చేశారు. 

మహిళ ఏమంటుందంటే..

దీనిమీద బాధితురాలు మాట్లాడుతూ.. తెల్కూర్, అతని భార్య కొద్ది రోజుల క్రితం తనను ఒక స్టార్ హోటల్‌లో కలిశారని.. వారి కొడుకును చూసుకుంటానని అతను హామీ ఇచ్చాడని ఆమె పేర్కొంది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లైతే, ఆ హోటల్ సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలని ఆమె తెలిపింది.

విధానసౌధ పోలీసులు ఎమ్మెల్యేను వేధింపులకు గురిచేస్తున్నానని ఆరోపిస్తూ, ఆదివారం ఉదయం నా అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి విచారణ కోసం స్టేషన్‌కు తీసుకెళ్లారని.. ఆమె చెప్పారు. “ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు నన్ను స్టేషన్‌లో ఉంచారు. నేను రోజంతా పిల్లలను ఒంటరిగా అపార్ట్మెంట్ లో వదిలిపెట్టాను. పోలీసులు నా మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కున్నారు. పోలీసులను ప్రశ్నించడానికి వచ్చిన సెక్యూరిటీ గార్డును పోలీసు సిబ్బందిలో ఒకరు కొట్టారు”అని ఆమె ఆరోపించింది.

“ఇప్పుడు కూడా, నాపై నిఘా ఉంచడానికి నా అపార్ట్‌మెంట్ బయట కొంత మంది పోలీసులను మోహరించారు. ఇది వేధింపు కాదా?" ఆమె ప్రశ్నించింది. బాధితురాలితో పాటు న్యాయవాది జగదీష్ కుమార్ మాట్లాడుతూ, పోలీసుల చర్య అక్రమార్జన, అక్రమ నిర్బంధం, వేధింపులకు సమానమని అన్నారు. ఆమెపై కేసు ఉంటే అరెస్టు చేయనివ్వండి, అంతే కానీ ఇలా చేయడం.. స్పష్టంగా వేధింపే అని ఆయన అన్నారు. తన కుమారుడికి న్యాయం జరిగేవరకు తాను న్యాయపోరాటం చేస్తానని ఆ మహిళ తెలిపింది.