Asianet News TeluguAsianet News Telugu

UP Elections: కాంగ్రెస్ కి షాక్.. రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యే అదితి

దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అదితీని పార్టీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం.

MLA Aditi Singh Resigns from Congress Party
Author
Hyderabad, First Published Jan 20, 2022, 1:01 PM IST

ఉత్తరప్రదేశ్ ( UP Elections) ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్  తగిలింది. ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే అదితీ సింగ్ కాంగ్రెస్ ను వీడారు. పార్టీ చీఫ్ సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయ్ బరేలీ ఎమ్మెల్యే అయిన అదితీ.. కాంగ్రెస్ ను వీడి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లెటర్ రాశారు. కాగా, రెండు నెలల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న అదితీ.. ఈరోజు సోనియాకు లెటర్ రాయడంతో రాజీనామాపై స్పష్టత వచ్చింది. 

దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అదితీని పార్టీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. దీంతో ఆమె పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలిగారని తెలుస్తోంది. 

ఇటు రాజీనామా పత్రం సమర్పించిన వెంటనే.. అతితి.. అటు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.  అదితి సింగ్ 2017లో రాయ్‌బరేలీలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి  ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల సమయానికి ఆమె.. కషాయ కండువా కప్పుకోవడం గమనార్హం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios