మైనర్ బాలికపై ఏడుగురు కామాంధుల అత్యాచారం

Minor Raped In Chennai
Highlights

బతుకుదెరుకు కోసం సొంతూరును వదిలిపెట్టి చెన్నై నగరానికి చేరుకున్న ఓ మైనర్ బాలిక కొందరు యువకులు అఘాయిత్యానికి పాల్నడ్డారు. ప్రేమ పేరుతో  యువతిని నమ్మించిన ఓ యువకుడు, బ్లాక్ మెయిల్ చేసి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. ఈ ఘోరం తమిళనాడులో చోటుచేసుకుంది.

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పుదుచ్చేరిలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన 17ఏళ్ల మైనర్ బాలిక చెన్నైలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అయితే ఈ యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు  ప్రేమ పేరుతో వంచించాడు. మొదట యువతికి మాయమాటలు చెప్పి మంచివాడిలా నటిస్తూ చనువు పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పి యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. అయితే ఇలా ఆమెతో ఏకాంతంగా గడిపిన వీడియోను తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు.

అప్పటినుండి అతడిలోని రాక్షసుడు మేల్కొన్నాడు. ఈ వీడియోను చూపించి యవతిని వేధించడం ప్రారంభించాడు. ఇలా ఆ యువకుడు బెదిరించి తన ఆరుగురు స్నేహితులతో కలిసి యువతిపై అత్యంత దారుణంగా లైంగికదాడి చేశాడు.

అయితే ఈ ఆగడాలు సృతిమించడంతో భరించలేకపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

loader