మేనత్త ఇంటికి వచ్చిన చిన్నారిని కొందరు దుర్మార్గులు కిడ్నాప్ చేశారు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా రెండు రోజుల పాటు పలువురు వ్యక్తులు, అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత నోట్లో విషం పోసి.. జిల్లా ఆస్పత్రి గేట్ల వద్ద పడేసి పారిపోయారు..చికిత్స తీసుకుంటూ ఆ చిన్నారి కన్నుమూసింది. 

మధ్యప్రదేశ్‌ : Madhya Pradeshలోని సీధీ జిల్లాలోని హాత్వా అడవుల్లో రెండు రోజుల పాటు Kidnapped చేయబడి, పలుమార్లు rapeకి గురైన Minor girl సోమవారం జిల్లా ఆసుపత్రిలో మరణించింది. బాధితురాలు ఫిబ్రవరి 11న రేవాజిల్లాలోని తన మేనత్త నివాసం బైట కిడ్నాప్ కు గురైంది.

ఆస్పత్రిలో చేరిన తరువాత మైనర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. సిద్ధి జిల్లా ఆసుపత్రిలో పడేసే ముందు ఆమె మీద అత్యాచారం చేసిన నిందితుడి స్నేహితుల్లో ఒకరు ఆమెతో బలవంతంగా విషం తినిపించాడు. రేవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రిజిస్ట్రేషన్ నంబర్ లేని జీపులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన మేనకోడలిని కిడ్నాప్ చేశారని.. బాధితురాలి అత్త చేసిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 11న హనుమన్న పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది.

సిద్ధి జిల్లా నివాసి అయిన బాధితురాలు కిడ్నాప్‌కు గురైన రోజు రేవాజిల్లాలోని తన అత్త ఇంటికి వచ్చింది. ఈ కిడ్నాప్ కు సంబంధించిన ఫిర్యాదుతో పోలీసులు కేసులో క్లూల కోసం వెతుకున్న క్రమంలోనే అనిల్ తివారీ అనే వ్యక్తి బాధితురాలిని ఫిబ్రవరి 13 అర్థరాత్రి జిల్లా ఆసుపత్రి గేటు వద్ద పడేసి పారిపోయాడు. బెహ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాత్వా గ్రామానికి చెందిన జీవేంద్ర సింగ్, అభిరాజ్ యాదవ్ తనను కిడ్నాప్ చేశారని, రెండు రోజుల పాటు జీవేంద్ర సింగ్ తనపై పదేపదే అత్యాచారం చేశాడని బాధితురాలు తన వాంగ్మూలంలో వెల్లడించింది.

ఈ వ్యాఖ్యలను ఇప్పుడు పోలీసులు మరణ వాంగ్మూలంగా పరిగణిస్తున్నారు. తాను పోలీసులకు చెబుతానని బెదిరించడంతో.. తనతో బలవంతంగా విషం తినిపించారని కూడా ఆమె పేర్కొంది. సీధీ జిల్లా ఆసుపత్రిలో బాధితురాలు మరణించిన ఇరవై గంటల తర్వాత, ప్రధాన నిందితుడు జీవేంద్ర సింగ్ కూడా విషం తాగాడు. జిల్లా ఆసుపత్రికి చేరుకునేలోగా అతను మరణించినట్లు ప్రకటించారు.

సిధి జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజు లతా పటేల్, ప్రధాన నిందితుడు కూడా విషం తాగి మరణించాడని ధృవీకరిస్తూ, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. “రేవాజిల్లాలో కిడ్నాప్ కేసు నమోదవుతుండగా, వైద్యులు ఇంకా పోస్ట్ మోర్టమ్ నివేదికను సమర్పించలేదు. వైద్యుల నుంచి నివేదిక అందిన తర్వాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని పటేల్ చెప్పారు. ప్రస్తుతం చనిపోయిన ప్రధాన నిందితుడు జీవేంద్ర సింగ్ వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రి అని పోలీసులు తెలిపారు.

కాగా, రాజస్తాన్ లో ఫిబ్రవరి 14న ఇలాంటి ఘటనే జరిగింది. ఆ బాలిక సమీప అటవీ ప్రాంతంలో Sheep మేపుతూ ఉంటుంది. ప్రతి రోజూ లాగానే శుక్రవారం ఉదయం కూడా గొర్రెలను తీసుకుని forestలోకి వెళ్ళింది. ఉదయం 11 గంటల సమయంలో ఆమెను ఒంటరిగా చూసిన ఐదుగురు వ్యక్తులు బలవంతంగా బైక్ మీద ఎత్తుకెళ్లారు. కొందరు పిల్లలు ఆ దృశ్యాన్ని చూసి ఊర్లోకి వెళ్లి అందరికీ చెప్పారు. గ్రామస్తులు ఎంత వెతికినా ఆ బాలిక కనిపించలేదు. చివరికి ఆమె రెండు రోజుల తర్వాత ఆదివారం ఇంటికి చేరుకుంది. తన మీద 16 మంది అత్యాచారం చేశారని ఆమె చెప్పింది విని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.