మైనర్ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన  ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఎనిమిదేళ్ల బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం జాతీయ రహదారిపై బాలికను పడేసి వెళ్లిపోయారు. బెమెత్రా వద్ద తీవ్రగాయాలతో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించారు.

చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కాగా... బాలికను కిడ్నాప్ చేసి అనంతరం ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

కాగా.. ఇలాంటి సంఘటనే రాజస్థాన్ లోనూ చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని దౌసా జిల్లాలోనూ ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. మంగళవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన బాలిక బుధవారం తెల్లవారుజామున తన ఇంటికి కొద్ది దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలో అచేతనంగా పడి కనిపించింది. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.