అతను.. ప్రియురాలితో ఏకాంతంగా గడపాలని అనుకున్నాడు. సరైన సమయం కోసం ఎదరుచూశాడు. ఆ సమయం కాస్త వచ్చేసరికి ప్రియురాలి ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ అతను.. తన ప్రియురాలితో సరసాలు మొదలుపెట్టాడు. అయితే.. సడెన్ గా.. వారి ఏకాంత సమయాన్ని ప్రియురాలి తమ్ముడు డిస్టర్బ్ చేశాడు. వారి గదిలోకి బాలుడు రావడంతో.. అతను కంగారుపడిపోయి.. ఆమె ఎదురుగానే.. తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ జిల్లా బరేలీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బరేలికి చెందిన ఓ మైనర్ బాలికకు మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇటీవల... బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో.. ప్రియుడు వారి ఇంటికి వచ్చాడు. వారు ఏకాంతంగా సరసాలు ఆడుతుండగా.. ఇంట్లోకి బాలిక తమ్ముడు ప్రవేశించాడు. 

ఆమె తమ్ముడు ఒక్కసారిగా గదిలోకి రావడంతో ఇద్దరూ కంగారు పడ్డారు. తమ గురించి ఆమె తల్లిదండ్రులకు తెలుస్తుందని కంగారు పడ్డ నిందితుడు ఆ ఆరేళ్ల బాలుడిని హత్య చేశాడు. బాలిక కూడా తన బాయ్‌ఫ్రెండ్‌కు అడ్డుపడలేదు. ఇంటిపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి తమ్ముడు చనిపోయాడంటూ సాయంత్రం ఇంటికిచ్చిన తల్లిదండ్రులకు ఆమె చెప్పింది. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఆ చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే తమ్ముడి మరణంతో మానసికంగా కుంగిపోయిన బాలిక.. హత్య జరిగిన రెండు రోజుల తరువాత తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై హత్య, అత్యాచారం కేసుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు. త్వరలో ఆమెను బాల నేరస్థుల కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా.. ఈ నేరానికి పాల్పడ్డ నిందితుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.