కన్నౌజ్ జిల్లాలోని తాల్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల కిత్రం పెళ్లి ఊరేగింపు నుండి తప్పిపోయిన ఏడు ఏండ్ల బాలిక శవమై కనిపించింది. ఆ బాలిక శరీరం, ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలున్నాయనీ, చిన్నారిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో అత్యంత పాశవికమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన స్థితిలో ఏడేళ్ల బాలిక మృతదేహం కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అందిన సమాచారం మేరకు మొక్కజొన్న చేనులో బాలిక మృతదేహం అత్యంత దారుణంగా.. వివస్త్రగా కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ బృందం ఘటనాస్థలిని పరిశీలిస్తోంది. బాలికను అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.
కన్నౌజ్ జిల్లాలోని తాల్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేటా ఖాస్ చౌకీ గ్రామంలో ఏడ్లేండ్ల బాలిక మూడు రోజుల క్రితం తప్పిపోయిన కేసు తెరపైకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం .. ఇక్కడి ఓ ఇంట్లో కూతురు పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో వధువు 7 ఏళ్ల బంధువు హఠాత్తుగా కనిపించకుండా పోయింది. పెళ్లి సమయంలో మొదట కుటుంబ సభ్యులు అమ్మాయిని పట్టించుకోలేదని చెబుతున్నారు. అయితే ఎంతసేపటికి బాలిక కనిపించకపోవడంతో బంధువులు వెతకడం ప్రారంభించారు. కానీ ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. దీంతో మరుసటి రోజు ఉదయం బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.
బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు పోలీసులు, అటు కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలో ఉన్న మొక్కజొన్న పొలంలో ఆ చిన్నారి మృతదేహం లభ్యమైంది. బాలిక మృతదేహం నగ్నంగా, ఛిద్రమైన స్థితిలో కనిపించింది.
బాలికపై అత్యాచారం చేసి.. అత్యంత పాశవికంగా దాడి చేసినట్టు బాలిక బంధువులు చెబుతున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక రెండు కళ్లపై తీవ్ర గాయాలు ఉన్నాయి.కాళ్లు విరిగిపోయాయి. అలాగే.. బాలిక జననాంగాలు, చేతులపై బలమైన గాయాలతో పాటు శరీరంపై పలుచోట్ల తీవ్రమైన గాయాలున్నాయని చిన్నారి కుటుంబీకులు చెబుతున్నారు.
ప్రస్తుతం పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహం లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. ఈ మొత్తం వ్యవహారంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కుమార్ అనుపమ్ తెలిపారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా, క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.
