Asianet News TeluguAsianet News Telugu

థియేటర్లలో 100 సీట్లు, స్విమ్మింగ్‌పూల్‌లు అందరికీ: లాక్‌డౌన్ కొత్త మార్గదర్శకాలు

దేశంలో కొవిడ్‌ను నియంత్రించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం లాక్‌‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో ఆంక్షల్ని నిదానంగా ఎత్తివేస్తూ వచ్చింది. తాజాగా కరోనా వ్యాప్తిని మరింతగా కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను పొడిగించింది. 

mha new guidelines for surveillance containment and caution ksp
Author
new delhi, First Published Jan 27, 2021, 9:33 PM IST

దేశంలో కొవిడ్‌ను నియంత్రించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం లాక్‌‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో ఆంక్షల్ని నిదానంగా ఎత్తివేస్తూ వచ్చింది. తాజాగా కరోనా వ్యాప్తిని మరింతగా కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను పొడిగించింది.

నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతుండటంతో కేంద్రం మరిన్ని వెసులుబాటులు కల్పించింది. 

  • 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి
  • కేవలం క్రీడాకారులే కాకుండా అందరూ స్విమ్మింగ్‌ పూల్స్‌కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. 
  • కంటైన్‌మెంట్‌ జోన్‌ల వెలుపలి అన్ని కార్యకలాపాలకూ అనుమతి  
  • కేవలం వ్యాపార తరహానే కాకుండా అన్ని రకాల ఎగ్జిబిషన్‌ హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది.  
  • పౌర విమానయాన శాఖ, కేంద్రహోం శాఖ సమీక్ష తర్వాత  అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిర్ణయం
  • సామాజిక/ఆధ్యాత్మిక/క్రీడా/ వినోద/విద్యా/సాంస్కృతిక సంబంధిత సభలు, సమావేశాలకు హాలు సామర్థ్యంలో 50శాతం (లేదా 200మంది మించరాదు) వరకు గతంలో అనుమతించిన కేంద్రం.. తాజాగా ఆ పరిమితిని సడలించింది. 
  • ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు 
  • 65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
Follow Us:
Download App:
  • android
  • ios