ప్రపంచకప్ లో టీం ఇండియా విజయానికి బ్రేకులు పడ్డాయి. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా ఓటమిపాలయ్యింది. అయితే... టీం ఇండియా ధరించిన ఆరెంజ్ రంగు జెర్సీ కారణంగానే జట్టు ఓటమికి కారణమయ్యిందని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మోహబూబా ముఫ్తీ అన్నారు. ఈమేరకు ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.

‘అసంబద్ధంగా చెబుతున్నానని మీరు నన్ను అనుకోవచ్చు గానీ వరల్డ్ కప్‌లో భారత్ విజయ పరంపరకు బ్రేక్ పడటానికి కొత్తగా వారు ధరించిన ఆరెంజ్ జెర్సీ కూడా ఒక కారణం’ అని ఆమె ట్వీట్ చేశారు.

ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా కేవలం 31 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. అయితే... ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆరెంజ్ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్, భారత్ జెర్సీలు రెండు ఒకే రంగు కావడంతో... టీం ఇండియా జెర్సీ మార్చుకోవాల్సి వచ్చింది. అలా మార్చుకోవడం వల్లనే ఇప్పటి వరకు విజయాలతో దూసుకుపోయిన టీం ఇండియా ఓటమి చెందిందని మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు.