Meghalaya High Court: 10 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి సంబంధించిన కేసులో మేఘాలయ కోర్టు సంచనల తీర్పునిచ్చింది. మహిళ జననేంద్రియాలను లోదుస్తులపై నుంచి తాకినా.. లైంగిక వేధింపుల కిందికే వస్తుందని.. అలా చేయడం కూడా అత్యాచారం కిందికే వస్తుందని సంచలన తీర్పును వెల్లడించింది మేఘాలయ కోర్టు.
Meghalaya High Court: చిన్నారిపై అత్యాచారం కేసులో మేఘాలయ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననేంద్రియాలను లోదుస్తులపై నుంచి తాకినా.. లైంగిక వేధింపులకు పాల్పడితే అది అత్యాచారంగా పరిగణించబడుతుందని, నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 375 (బి) కింద అభియోగాలు నమోదు చేయవచ్చని మేఘాలయ హైకోర్టు పేర్కొంది. అలా చేయడం పెనట్రేటివ్సెక్స్కిందికి వస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్సంజీవ్ బెనర్జీ నేతృత్వంలోని డివిజనల్బెంచ్పేర్కొంది. మహిళ యోని లేదా మూత్రనాళంలోకి ఏదైనా చొప్పించడం శిక్షా స్మృతిలోని సెక్షన్375(బి) ప్రకారం అత్యాచారమే (Rape) అవుతుందని తీర్పు వెలువరించారు
2006, సెప్టెంబరు 23న తనపై అత్యాచారం జరిగిందని పదేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు ప్రకారం.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలికి వైద్య పరీక్షలకు పంపించారు. ఈ సమయంలో ఆ బాలిక ప్రైవేట్ భాగాలలో నొప్పిగా ఉందని, కానీ నిందితుడు తన లోదుస్తులను తొలగించలేదని పేర్కొంది. వైద్యులు కూడా అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఈ క్రమంలో 2018, అక్టోబర్ 31 న స్థానిక కోర్టు.. నిందితుడ్ని దోషిగా నిర్ధారించి, అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹ 25,000 జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
కానీ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. తన వాదనను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, బాలికపై లైంగిక చర్యకు పాల్పడలేదని, బాలిక లోదుస్తులను తొలగించకుండా నుంచి పురుషాంగంతో తాకానని వాదించారు. ఇతడి వాదనలు విన్న మేఘాలయ హైకోర్టు .. అలా చేయడం కూడా అత్యాచారమేనని, నిందితుడు శిక్షార్హుడేనని సంచలన తీర్పునిచ్చింది.
నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష తోపాటు ₹ 25,000 జరిమానా.. చెల్లించడానికి డిఫాల్ట్ అయితే అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు నిచ్చింది. భారత శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ 375 ప్రకారం..బాధితుడు మైనర్ అయినందున .. నిందితుడు మేజరే.. అతడు నియంత్రణ కోల్పోయి నేరానికి పాల్పడ్డడాని.. నిందితుడు శిక్షార్హుడేనని పేర్కొంది Meghalaya High Court.
ఇలా ఉంటే.. గతంలోనూ నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్ నిరూపితం కానందున ఈ చర్య పోక్సో చట్ట పరిధికి రాదని, నిందితుడిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోలేమని తీర్పుదుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పట్లో బాంబే హైకోర్టు వ్యాఖ్యానించడం సంచలనం రేపాయి. తాజాగా ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
