Mauritius PM Ramgoolam Visits Ayodhya : మారిషస్ ప్రధాని నవిన్‌చంద్ర రామ్‌గూలం అయోధ్యలో రామ్‌లల్లా, రామ్ దర్బార్ దర్శించుకున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని పర్యటనతో భారత్-మారిషస్ సంబంధాలు మరింత బలపడనున్నాయి.
Mauritius PM Ramgoolam Visits Ayodhya: ఇవాళ (సెప్టెంబర్ 12, శుక్రవారం) అయోధ్యలో మారిషస్ ప్రధాని నవిన్‌చంద్ర రామ్‌గూలం పర్యటించారు. ఆయన పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, ఇతర మంత్రులు, అధికారులు అయోధ్యకు రాావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా నగరం అంతా పోస్టర్లు, అలంకరణలతో ముస్తాబైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో మారిషస్ పీఎంకి ఆత్మీయ స్వాగతం పలికారు.
కాశీ నుంచి అయోధ్య వరకు రామ్‌గూలం యాత్ర
అయోధ్య వెళ్లేముందు రామ్‌గూలం వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత శ్రీరామ జన్మభూమికి వెళ్లి, రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు.
రామ్‌గూలం 30 మంది సభ్యులతో రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. రామ్ దర్బార్, కుబేర్ టీలాలోని శివాలయంలో కూడా పూజలు చేశారని చెప్పారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
రామ్‌గూలం పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా అంతటా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు.
గురువారం ప్రధాని మోదీ, రామ్‌గూలం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ, ఇంధనం, సముద్ర భద్రత వంటి అంశాలపై చర్చించారు. రామ్‌గూలం 9 నుంచి 16 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు.
ఇవి కూడా చూడండి: అయోధ్య-వారణాసి ఎక్స్‌ప్రెస్ వే: రెండు గంటల్లో ప్రయాణం
