Asianet News TeluguAsianet News Telugu

ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో  సోమవారం నాడు  అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో  ఈ ప్రమాదం వాటిల్లింది

Massive fire at Kumbh Mela 2019 triggered by cylinder blast, several tents gutted
Author
Lucknow, First Published Jan 14, 2019, 2:11 PM IST

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో  సోమవారం నాడు  అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో  ఈ ప్రమాదం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  దిగంబర్ అఖాండా ప్రాంతంలో వంట గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం వాటిల్లింది.   ప్రమాదం జరిగిన చోట   వందలాది టెంట్లు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

49 రోజుల పాటు  అర్ధ కుంభమేళా జరగనుంది. ఈ  కుంభమేళాకు సుమారు 12 కోట్ల మంది హాజరౌతారని  అంచనా వేస్తున్నారు ఈ కుంభమేళాలో నాగ సాధువులు కూడ పాల్గొంటారు.  49 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాలో  8 రోజులను అత్యంత  పవిత్రంగా చూస్తారు. ఈ కుంభమేళా రేపటి నుండి ప్రారంభం కానుంది.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios