ప్రియుడు కోసం ప్రియురాలో.. లేదంటే ప్రియురాలి కోసం ప్రేమికుడో ఇంట్లో నుంచి పారిపోతారు. అలాంటిది అమ్మాయి కోసం వివాహిత భర్తను వదిలిపెట్టి పోయింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌కు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వారం రోజుల క్రితం వివాహమైంది.

అయితే రెండు రోజుల క్రితం ఆమే ఆకస్మాత్తుగా మాయమైంది. దీంతో ఆమె భర్తను యువతి తల్లిదండ్రులు, బంధువులు అనుమానించారు. తనకేం తెలియదని చెప్పడంతో అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత భర్తను స్టేషన్‌కు పిలిపించి జరిపిన విచారణలో తన భార్య పెళ్లైన నాటి నుంచి తనను దగ్గరకు రానిచ్చేది కాదని.. అయిష్టంగానే తనతో మాట్లాడేదని వాపోయాడు.

దీంతో పోలీసులు ఏదైనా ప్రేమ వ్యవహారం ఉండవచ్చని భావించారు. ఈ క్రమంలో వివాహిత స్నేహితులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తిరునల్వేలి జిల్లా పనకుడికి చెందిన ఓ స్నేహితురాలితో వివాహిత అత్యంత సన్నిహితంగా ఉండేదని.. ఆ ఇద్దరు హాస్టల్‌లో ఉండగా స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారని తెలిపారు.

ఓ రోజు స్వలింగ సంపర్కం చేసుకుంటూ అందరికంటా పడ్డారని బాంబు పేల్చారు. దీంతో పనకుడికి వెళ్లిన పోలీసులకు అక్కడున్న తిరునల్వేలి నుంచి ఆదృశ్యం కావడంతో వారి అనుమానం బలపడింది. తిరునల్వేలి నుంచి అదృశ్యమైన రోజున వారిద్దరు రైలులో చెన్నైకి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో  పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.