ప్రియుడితో సన్నిహితంగా మెలిగిన ఫోటో బయటకు రావడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అరియలూరు జిల్లా  సెందురై సమీపంలోని నమంగునం గ్రామానికి చెందిన చుడర్‌మణి చెన్నై కోయంబేడు మార్కెట్‌లో పనిచేస్తున్నాడు.

ఇతని భార్య సంగీత. చుడర్‌మణితో అదే గ్రామానికి చెందిన శరవణన్‌ కలిసి పనిచేస్తున్నారు. ఒకే గ్రామానికి  చెందిన వారు కావడంతో వారి మధ్య బాగా స్నేహం కుదరడంతో ఇరువురు బాగా సన్నిహితంగా మెలిగేవారు.

సొంతూరుకు వెళ్లినప్పుడు తరచుగా కలుసుకునేవారు. ఆ సమయంలో చుడర్‌మణి భార్య సంగీతతో శరవణన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. అలా వారిద్దరు గ్రామానికి వచ్చినప్పుడు చుడర్‌మణికి పీకలదాకా మద్యం తాగించి, అతని భార్యతో శరవణన్‌ గడిపేవాడు.

ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే చుడర్‌మణికి వీరి విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సంగీత ఏడాదిగా భర్తతో విడిగా ఉంటోంది. ఇలా ఉండగా.. శరవణన్‌ సంగీతను తనతో గడపమని ఒత్తిడి చేశాడు.. లేకుంటే ఆమెతో గడుపుతున్న ఫోటోను వాట్సాప్‌లో విడుదల చేస్తానని బెదిరించాడు.

అతని బెదిరింపులకు లోంగకపోవడంతో 19వ తేదీ సంగీత బంధువు అరివళగన్‌కు వాట్సాప్ ద్వారా కొన్ని ఫోటోలను పంపించాడు. ఈ విషయం తెలియడంతో సంగీత, తల్లితో పాటు విషయం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.  

దీంతో ఇద్దరిని తంజావూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంగీత శనివారం మరణించింది. దీనిపై ఆమె తండ్రి పెరియ స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న శరవణన్ కోసం గాలిస్తున్నారు.