ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ 22యేళ్ల యువతిపై అత్యాచారం చేశాడో కీచకుడు. దాన్ని వీడియో తీసి పెట్టాడు. ఆ తరువాత ఆమెకు పెళ్లైన విషయం తెలిసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. 

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ 22యేళ్ల యువతిపై అత్యాచారం చేశాడో కీచకుడు. దాన్ని వీడియో తీసి పెట్టాడు. ఆ తరువాత ఆమెకు పెళ్లైన విషయం తెలిసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. 

ఆ వీడియో చూసిన భర్త షాక్ అయ్యాడు. వెంటనే ఆమెను వదిలిపెట్టేశాడు. గుండెల్ని మెలిపెట్టే ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ లోని రేవ్తీ ప్రాంతంలో జరిగింది. 

ఈ కేసులో నిందితుడు నరేంద్ర 2020, జనవరిలో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమెపై అత్యాచారాన్ని వీడియో చిత్రీకరించాడు. ఆ తరువాత ఆమెకు వివాహం అయిన సంగతి తెలిసింది. 

వెంటనే 2020 డిసెంబర్ లో నరేంద్ర ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె భర్త ఈ వీడియో చూడడం, విషయం సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ కావడంతో తో అతను వెంటనే ఆమెను వదిలిపెట్టేశాడు. 

దీంతో పుట్టింటికి చేరిన బాధితురాలు, తండ్రితో వచ్చి ఫిర్యాదు చేసింది. దీనిమీద వెంటనే స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం నాడు నిందితుడు నరేంద్రను అరెస్ట్ చేశారు.