ట్విస్ట్: చెల్లెతో పెళ్ళిచూపులు,పెళ్ళైన అక్కతో యువకుడు జంప్

Married Woman escaped with sister  Fiance
Highlights

చెల్లెకు షాకిచ్చిన అక్క


చెన్నై: పెళ్ళి చూపులకు వచ్చిన ఓ వ్యక్తి, పెళ్ళి కూతురు
అక్కతో పారిపోయాడు. ఈ ఘటన తమిళనడు రాష్ట్రంలో
చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని మైలాపురం ఏకాబంరం పిళ్ళై
వీధకి చెందిన  ఓ వ్యక్తికి ఇద్దరు కూతుళ్ళున్నారు. అయితే
పెద్ద కూతురుకు  26 ఏళ్ళు. చిన్న కూతురుకు 22 ఏళ్ళు. 

పెద్ద కూతురుకు వివాహం చేశాడు. ఆమెకు మూడేళ్ళ కొడుకు
కూడ ఉన్నాడు.  అయితే రెండో కూతురుకు కూడ వివాహం
చేయాలని ఆయన నిర్ణయం తీసుకొన్నాడు.

ఈ ఏడాది జనవరి మాసంలో అన్నాదురై అనే వ్యక్తి చిన్న
కూతురిని చూసేందుకు వచ్చాడు. పెళ్ళి చూపులు
జరిగాయి.

పెళ్ళి చూపుల సమయంలో పెళ్ళి కూతురు అక్కతో పెళ్ళి
కొడుకు మాటలు కలిపాడు. అయితే పెళ్ళి కూతురు
నచ్చిందా, నచ్చలేదా అనే విషయమై సమాచారం
ఇవ్వలేదు.

కానీ, పెళ్ళి కూతురు అక్కతో మాత్రం ప్రతిరోజూ ఫోన్‌లో
మాట్లాడేవాడు. మే 30వ తేదిన తన కొడుకుతో కలిసి
వివాహిత పారిపోయింది. 

ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన వివాహిత
కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహిత
పారిపోతూ ఇంట్లోని నగలను, రూ.2 లక్షలను తీసుకెళ్ళింది.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రేమ జంట కోసం
గాలింపు చర్యలు చేపట్టారు. 

loader