Asianet News TeluguAsianet News Telugu

మరాఠా రిజర్వేషన్ల పోరాటం : మహారాష్ట్రలో ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు..

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల పోరాటం ఉదృతం అవుతోంది. నిరసనకారులు ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి ఇంటికి నిప్పు పెట్టారు.

Maratha reservation fight : NCP MLA house set on fire in Maharashtra - bsb
Author
First Published Oct 30, 2023, 1:41 PM IST

మహారాష్ట్ర : మహారాష్ట్రలో ఓ ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఆ తరువాత ఇంటి బయటున్న వాహనానికి నిప్పుపెట్టారు. ఆ తరువాత ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఈ సమయంలో ప్రకాశ్ సోలంకి, ఆయన కుటుంబం ఇంట్లోనే ఉన్నారు. 

మరాఠా రిజర్వేషన్ల పోరాటం ఉదృతం అవుతోంది. ప్రకాశ్ సోలంకి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. ఇటీవల ఆయన మరాఠా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న జారంగి పాటిల్ ను విమర్శించారు. దీంతో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రకాష్ సోలంకి ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. నిప్పు పెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios