తాను ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’  పేరిట మన్మోహన్ జీవితంపై బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా.. అందులో మన్మోహన్ ని, కాంగ్రెస్ పార్టీని కించపరిచేవిధంగా దృశ్యాలు ఉన్నాయి.

అయితే.. ఆ సినిమా నిర్మాతలపై పరువు నష్టం దావా వెయ్యమని మన్మోహన్ సింగ్ కి కొందరు కాంగ్రెస్ నేతలు సూచించారట. ఈ విషయాన్ని మన్మోహన్ తన మిత్రుడు, ఏపీకి చెందిన మాజీ ఎంపీ యలమంచిలి శివాజీతో చెప్పారు.

‘‘నిజమే.. నన్ను పరువునష్టం దావా వేయమని చాలా మంది చెప్పారు.. కానీ వారిపై దావా వేసి కోర్టులో పోరాడేందుకు నా దగ్గర డబ్బులేవి..? లాయర్లకు భారీగా ఫీజులు చెల్లించాలి కదా..?’’ అని మన్మోహన్ సింగ్ తన సన్నిహితుల వద్ద వాపోయారట. దేశానికి ప్రధానిగా వ్యవహరించి... దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన.. వ్యక్తి ఇప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడటం చాలా మందిని కలిచివేస్తోంది.