బెంగుళూరు:ప్రియురాలిని దారుణంగా కత్తితో పొడిచి ఆ తర్వాత తాను పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు శక్తి నగర్‌కు చెందిన సుశాంత్  బంగబిలా గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. సుశాంత్ హైస్కూల్‌లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. సుశాంత్ కు ఓ యువతితో  పరిచయం ఉంది. హైస్కూల్ నుండే వీరిద్దరూ ప్రేమించుకొంటున్నారు.

ఇటీవల ఆ యువతి పుట్టిన రోజు సందర్భంగా సుశాంత్ రూ. 50 వేలు ఖర్చు పెట్టాడు.కానీ, సుశాంత్ తో ఆ యువతి దూరంగా ఉంటుంది. దీంతో సుశాంత్ తట్టుకోలేకపోయాడు.  అంతేకాదు సుశాంత్ పై ఆ యువతి పోలీసులకు కూడ ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  సుశాంత్ ప్రియురాలిపై కోపం పెంచుకొన్నాడు.

మంగుళూరు నుంి బగంబిలా గ్రామానికి శుక్రవారం సాయంత్రం  నిందితుడు చేరుకొన్నాడు కాలేజీ నుండి తన ప్రియురాలు వచ్చేవరకు ఇంటి వద్దే వేచి ఉన్నాడు.
ఆమె ఇంటికి రాగానే  తన వెంట తెచ్చుకొన్న కత్తితో  ఆమెను కత్తితో పొడిచాడు.

 ఆ తర్వాత తాను కూడ గొంతు కోసుకొన్నాడు స్థానికులు వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ప్రియుడు సుశాంత్ కోలుకొన్నాడు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.