స్కూల్ తరగతి గదిలోనే  టీచర్‌ రమ్యను హత్య చేసిన రాజశేఖర్ అనే  యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమ్యను చంపిన తర్వాత రాజశేఖర్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొన్నాడు. 

చెన్నై: స్కూల్ తరగతి గదిలోనే టీచర్‌ రమ్యను హత్య చేసిన రాజశేఖర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమ్యను చంపిన తర్వాత రాజశేఖర్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొన్నాడు. కానీ, తిరునవళ్లూరు అటవీ ప్రాంతంలో రాజశేఖర్ చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు

ఈ నెల 22వ తేదీన తరగతి గదిలో టీచర్ రమ్యను రాజశేఖర్ హత్య చేశాడు.ఈ హత్య చేసిన తర్వాత రాజశేఖర్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొన్నాడు.

రమ్యను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె కుటుంబసభ్యులతో ఇటీవలే రాజశేఖర్ అడిగాడు. అయితే ఈ పెళ్లికి రాజశేఖర్ ఒప్పుకోలేదని సమాచారం. దీంతో రాజశేఖర్ తరగతి గదిలోనే రమ్యను హత్యచేశారు. 

రమ్యను హత్య చేసిన తర్వాత రాజశేఖర్ కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే రాజశేఖర్ మాత్రం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

పెళ్లికి నో: క్లాస్‌రూమ్‌లోనే టీచర్ హత్య