మాండ్యా జిల్లా మాలవలిలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లితో అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిని అత్యంత పాశవికంగా నరికేశాడో యువకుడు. వివరాల్లోకి వెళ్లే కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా చిక్కబాగిలు గ్రామానికి చెందిన పశుపతి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కర్ణాటక: మాండ్యా జిల్లా మాలవలిలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లితో అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిని అత్యంత పాశవికంగా నరికేశాడో యువకుడు. వివరాల్లోకి వెళ్లే కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా చిక్కబాగిలు గ్రామానికి చెందిన పశుపతి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి అంటే పశుపతికి విపరీతమైన ప్రేమ. తల్లిని ఎవరు ఏమన్నా సహించలేడు.
అయితే తన తల్లిపట్ల గిరీష్ అనే యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలుసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. తన తల్లిని అవమానించిన వాడి తల నరుకుతానంటూ తల్లితో చెప్పి వెళ్లిపోయాడు. గిరీష్ ఇంటికి వెళ్లి అతడి తలనరికేసిన పశుపతి ఆ తలను పట్టుకుని ఇంటికి వచ్చాడు. తల్లికి ఆ తలను చూపించి అక్కడ నుంచి మాలవలి పోలీస్ స్టేషన్ కు తలపట్టుకుని నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు.
తలపట్టుకుని నడుకుని రోడ్డుపై వెళ్తుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. తనతల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని అందుకే తలనరికేశానని పోలీసులతో చెప్పాడు పశుపతి. అయితే ఇటీవల కాలంలో ఇలా తల నరికిన ఘటన ఇది రెండోదిగా చెప్పుకోవచ్చు.
అయితే గిరీష్, పశుపతిలు మంచి స్నేహితులని పోలీసులు చెప్తున్నారు. అయితే గిరీష్ తన తల్లిపట్ల అసభ్యకరంగా మాట్లాడటంతో పశుపతి తట్టుకోలేకపోయాడని స్పష్టం చేశారు. దీంతో సహనం కోల్పోయిన పశుపతి గిరీష్ పై దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తీవ్ర ఆగ్రహానికి లోనైన పశుపతి ఒక్కసారిగా గిరీష్ తలనరికినట్లు తెలిపారు.
