Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదు నుంచి వచ్చి ఢిల్లీలో 500 లగ్జరీ కార్ల చోరీ

ఐదేళ్ల కాలంలో ఢిల్లీలో దాదాపు 500 కార్లు దొంగిలించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతనిపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది.

Man Stole 500 Luxury Cars In Delhi
Author
New Delhi, First Published Aug 11, 2018, 1:23 PM IST

న్యూఢిల్లీ: ఐదేళ్ల కాలంలో ఢిల్లీలో దాదాపు 500 కార్లు దొంగిలించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతనిపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. ఢిల్లీలోని నందనగరికి చెందిన 29 ఏళ్ల సఫ్రుద్దీన్, అతని ముఠా సభ్యులు హైదరాబాదు నుంచి వచ్చి కార్లను దొంగిలించి మళ్లీ హైదరాబాదుకు తిరిగి వెళ్తున్నారు. 

అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వాళ్లు అలా చేస్తూ వచ్చారు. ఈ నెల 3వ తేదీన గగన్ సినిమా వద్ద ఇన్ స్పెక్టర్ నీరజ్ చౌదరి, సబ్ ఇన్ స్పెక్టర్ కుల్దీప్ తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ కారును ఆపారు. 

డ్రైవర్ ను పోలీసులు సఫ్రుద్దీన్ గా గుర్తించారు. అయితే, అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. యాభై కిలోమీటర్లు వెంటాడి ప్రగతి మైదాన్ వద్ద పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 

ఢిల్లీలో ఈ ఏడాది వంద కార్లు దొంగిలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సఫ్రుదీన్ పోలీసులకు చెప్పాడు.  మొహమ్మద్ షరీక్, ఇతర ముఠా సభ్యులతో సఫ్రుదీన్ హైదరాబాదు నుంచి విమానంలో హైదరాబాదు వచ్చాడు. తమ వెంట వాళ్లు కార్ల సాఫ్ట్ వేర్లను, జీపిఎస్ ను, సెంట్రలైజ్డ్ లాకింగ్ సిస్టమ్స్ ను బ్రేక్ చేయడానికి ల్యాప్ టాప్, హైటెక్ గాడ్జెట్రీ తెచ్చుకున్నారు. 

వివేక్ విహార్ వద్ద జూన్ 5వ తేదీన సఫ్రుద్దీన్, అతని నలుగురు అనుచరులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో సఫ్రుద్దీన్ అనుచరుడు నూర్ మొహ్మద్ మరణించాడు. రవి కుల్దీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన కార్లను ముఠా సభ్యులు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తదితర రాష్ట్రాల్లో విక్రయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios