వారికి వివాహం జరిగి పుష్కరకాలం దాటింది. ఆప్యాయంగా చూసుకునే భర్త ఉన్నాడు. అయినా ఆమె బుద్ధి గడ్డి తిన్నది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ బంధమే చివరకు ఆమె ప్రాణాలు, అతని భర్త ప్రాణాలు తీసింది. ఆమె ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. ఈ దారుణ సంఘటన చిరకరమంగళూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తాలూకా సాత్కోళి గ్రామానికి చెందిన ధర్మయ్య (53), ఆయన భార్య భారతి (43)లకు వివాహం జరిగి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. కాగా... కొంత కాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన గోవింద అనే వ్యక్తితో భారతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ధర్మయ్యకు తెలియడంతో భారతిని హెచ్చరించాడు. ఈ క్రమంలో గోవింద్‌తో కూడా ధర్మయ్య గొడవపడ్డాడు.

 నెల రోజుల క్రితం ఇదే విషయంగా ఇద్దరు ఘర్షణ పడ్డారు. అప్పట్లో హతమారుస్తానని గోవింద్‌ హెచ్చరించాడు. దీంతో ధర్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాదం పెద్దది కావడంటో గ్రామపెద్దలు ఇద్దరిని రాజీ చేశారు. గొడవ ఇంత పెద్దది కావడంతో భారతి కూడా ప్రియుడు గోవింద్ ని దూరం పెట్టడం ప్రారంభించింది. 

 భారతి తనకు దూరమైందని ఆక్రోశంతో ఉన్న గోవింద్‌ శనివారం రాత్రి ధర్మయ్య ఇంటికి వచ్చాడు. దీంతో భార్యభర్తలు ఇద్దరు కలిసి గోవింద్‌ను చితకబాదారు. 
అనంతరం బయటకు వెళ్లిన గోవింద్‌ తిరిగి మచ్చు కత్తితో వచ్చి ధర్మయ్య, భారతీలను దారుణంగా నరికి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎన్‌ఆర్‌ పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్‌పీ రవీంద్రనాథ్‌ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు.