ఓ వ్యక్తి మైనర్ భార్యపై అత్యాచారం చేశాడు. అయితే రేప్‌‌కు పాల్పడిన తన భర్తను కాపాడటానికి నిందితుడి భార్య సదరు బాలికతో ఆయనకు పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా మలూర్ తాలూకా హునసికోట్‌‌కు చెందిన నాగరాజు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు.

భర్తను వదిలివచ్చిన పల్లవి అనే మహిళ ఇతనిని పెళ్లి చేసుకుని అక్కడే నివసిస్తున్నాడు. గత వారం పల్లవికి వరుసకు సోదరి అయ్యే 13 ఏళ్ల బాలిక వారి ఇంటికి వచ్చింది. ఆమెపై కన్నేసిన నాగరాజు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అక్కడితో ఆగకుండా ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో వారు గ్రామస్తులు మలూర్‌లోని చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.

వారు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను ప్రశ్నించారు. అయితే పోలీసులు తన భర్తను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశ్యంతో పల్లవి ముందుగానే బాలికతో తన భర్తకు పెళ్లి చేసినట్లు దర్యాప్తులో తేలింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో గంగరాజు, పల్లవిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.