Asianet News TeluguAsianet News Telugu

గర్భశోకంలో ఉన్న కన్న కూతురిపై.. కొడుకు ముందే తండ్రి అత్యాచారం, ఆపై గొంతు నులిమి...

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు వెంటనే ఆ కీచకుడైన తండ్రిని అదుపులోకి తీసుకుని, విచారించారు. కూతురు తమను కాదని పెళ్లి చేసుకోవడంతో సమాజంలో కుటుంబం పరువు పోయిందని అది భరించలేక కూతురిని హత్య చేసినట్లు తండ్రి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

Man rapes daughter and murder for marrying outside caste in madhya pradesh
Author
Hyderabad, First Published Nov 17, 2021, 4:30 PM IST

భోపాల్ : తన మాట కాదని ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి రాక్షసుడిగా మారాడు. కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక ఆ తరువాత ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర రాజధాని భోపాల్ లోని సంస్ గడ్ అడవుల్లో ఓ మహిళ, ఆమె ఎనిమిది నెలల కుమారుడి  మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా dead body సెహోర్ జిల్లాలోని  bilkisganjలో నివసిస్తున్న మహిళ, ఆమె 8 నెలల కొడుకుది అని తేలింది. దీని ఆధారంగా పోలీసులు విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు తెలిసిన పోలీసులు తేరుకోలేకపోయారు. 

విషయం ఏంటంటే.. ఆ మహిళ father దీనికి కారణం అని తెలిసింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది.  దీంతో పోలీసులు వెంటనే ఆ కీచకుడైన తండ్రిని అదుపులోకి తీసుకుని, విచారించారు. కూతురు తమను కాదని పెళ్లి చేసుకోవడంతో సమాజంలో కుటుంబం పరువు పోయిందని అది భరించలేక కూతురిని హత్య చేసినట్లు తండ్రి policeల ఎదుట ఒప్పుకున్నాడు.

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్ లోని రాతిబాద్‌ కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కూతురు ఏడాది క్రితం love marriage చేసుకుంది. ఇది తల్లిదండ్రులకు నచ్చలేదు. కూతుర్ని అది సరికాదని హెచ్చరించారు. అయితే తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని parents ను ఎదురించిన కూతురు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి marriage చేసుకుంది. దీంతో కూతురు, తండ్రికి మధ్య నిత్యం గొడవలు జరిగేవి.

Acid Attack : పెళ్లి చేసుకోవాలని 3 పిల్లల తల్లికి వేధింపులు, వినలేదని చేతులు, కాళ్లు కట్టేసి యాసిడ్ దాడి...

అందుకే ఆ daughter పెళ్లయినప్పటి నుంచి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు.  అయితే ఈ దీపావళికి తన అక్క ఇంటికి వెళ్లింది. అయితే, అక్కడ తన కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పుట్టెడు దుఖంలో మునిగిపోయింది.  ఆమె అక్క తన తండ్రిని సంప్రదించి సహాయం కోరింది. మనవడు చనిపోయిన సమాచారం అందుకున్న తండ్రి తన కుమారుడితో కలిసి రాతిబాద్‌ చేరుకున్నాడు.  

చనిపోయిన శిశువు అంత్యక్రియలు నిర్వహించేందుకు తమతోపాటు farest ప్రాంతానికి రావాల్సిందిగా కూతురిని కోరాడు.  దీంతో ఆమె తన తండ్రితో కలిసి అడవికి వెళ్లింది. ఓ వైపు కొడుకు చనిపోయి శోకసముద్రంలో మునిగిపోయిన కూతుర్ని ఓదార్చాల్సిందిపోయి.. ఆ తండ్రిలోని మృగం మేల్కోంది. ఒంటరిగా ఇన్నాళ్లకు కూతురు చిక్కిందనుకున్నాడు. ఇదే అదనుగా భావించిన తండ్రి కూతురుపై దాడి చేశాడు.

సభ్య సమాజం తలదించుకునేలా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అదీ కొడుకు ముందే.. ఆ తరువాత కూతురిని గొంతు నులిమి హత్య చేశాడు. అప్పటికి గానీ అతని పగ చల్లారలేదు. ఆ తర్వాత కొడుకుతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. కూతురు గురించి ఎవరైనా ఆరా తీస్తే.. అటు నుంచి అటే తన ఇంటికి వెళ్లిపోయిందని చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios