ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఓ వ్యక్తి అమానుషానికి ఒడిగట్టాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో మిరపకాయలు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. 

సూరత్ : అప్పటికే వివాహం అయిన ఓ వ్యక్తి ఆ విషయాన్ని దాచిపెట్టి మరో యువతితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శృంగార సంబంధాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ఆమెకు అతడికి పెళ్లైన విషయం తెలియడంతో నిలదీసింది. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో అతను ఒళ్లు గగుర్పొడిచే దారుణానికి ఒడి గట్టాడు. 

సూరత్‌లో ఒక వ్యక్తి తను సంబంధం పెట్టుకున్న మహిళపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా..నిందితుడు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో మిరపకాయలు నింపాడు. ఈ దారుణమైన ఘటనలో ఎలాగో ప్రాణాలతో బయటపడిన ఆమె ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆ తరువాత అతని మీద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయబడింది. 

భార్య ప్రైవేట్ పార్టులపై గొడ్డలి, కొడవలితో దాడి చేసి దారుణ హత్య.. అనంతరం భర్త ఆత్మహత్య

వివరాల్లోకి వెడితే.. నికుంజ్ కుమార్ అమృత్ భాయ్ పటేల్ అనే నిందితుడికి వివాహమయ్యింది, అతని భార్య వేరే గ్రామంలో ఉంటోంది. వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ విషయాన్ని తన ప్రియురాలి దగ్గర దాచిపెట్టాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అతనికి పెళ్లైన విషయం తెలిసే వరకు వారి సంబంధం బాగానే కొనసాగింది.

ప్రియురాలికి అతని పెళ్లి గురించి తెలియడంతో, వీరిద్దరూ గొడవ పడ్డారు. ఆ మహిళ పటేల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె నిర్ణయంపై ఆగ్రహం చెందిన పటేల్ తన ప్రియురాలిని కేబుల్ వైర్‌తో కొట్టి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో మిరపకాయలు కూడా నింపాడు. ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని నిందితుడు ఆమెను బెదిరించాడు.

ప్రాణాలతో బయటపడిన ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. అనంతరం ఓల్పాడ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు.