కట్టుకున్న భార్య, రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురిని ఓ వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. భార్య, కూతురిని గొంతు పిసికి చంపేసి.. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానా రాష్ట్రం ఫతేబాద్ జిల్లా తోహనా పట్టణానికి చెందిన సునీల్ కుమార్(35) అనే వ్యక్తికి భార్య మంజు దేవి(32), 18 నెలల కుమార్తె ఉన్నారు. కాగా.. బుధవారం రాత్రి సునీల్ తన భార్య మంజు, కుమార్తెను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం సునీల్ ఇంట్లోని స్టోర్ రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మంజు దేవి, చిన్నారి మృతదేహాలు మంచంపై పడి ఉండటాన్ని గమనించారు. వారి మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించగా.. గొంతు పిసకడం వల్లే చనిపోయారని తెలుస్తోంది. వారిద్దరిని చంపిన తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. అతను అలా చేయడానికి గల కారణం మాత్రం తెలియలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.