తాను పోలీసు అధికారిని అంటూ ఓ యువకుడు అమాయకమైన మహిళను బుట్టులో వేసుకుని, హోటల్ గదిలో ఆమె అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తాను పోలీసు ఆఫీసరునంటూ మహిళపై హోటల్లో అత్యాచారం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరానికి ెచందిన సందీప్ కుమార్ అనే 28 ఏళ్ల యువకుడు ఢిల్లీ పహర్ గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఆ దారుణానికి పాల్పడ్డాడు. 

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి యువకుడు సందీప్ కుమార్ మీద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడు సందీప్ కుమార్ తనను పోలీసు అధికారిగా చెబుకుంటూ హోటల్లో ఓ గదిని బుక్ చేశాడు. 

సీసీటీవీ ఫుటేజీలతో పాటు నిందితుడి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. నిందితుడు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని బార్ లను సందర్సించాడని, అతను తరుచుగా ఫోన్ నెంబర్లు మారుస్తూ మహిళను సంప్రదించాడని పోలీసులు చెప్పారు. 

తాను యూపి పోలీసు అధికారిని అంటూ అతను చెబుకున్నాడు. అలా చెబుతూ మహిళను తన వలలో వేసుకున్నాడు. చివరకు ఆమెపై అత్యాచారాం చేశాడు. నిందితుడి అద్దె ఇంటి నుంచి పోలీసులు యూపి పోలీసు నేమ్ ప్లేటును, మూడు మొబైల్ ఫోన్లను, రెండు నకిలీ గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సందీప్ కుమార్ ను అరెస్టు చేశారు.