మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి.. దానిని చూపించి బ్లాక్ మొయిల్ చేసి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జైపూర్ లో చోటుచేసుంది. జైపూర్ లోని బార్మర్ జిల్లాలోని బాల్టోరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా..  ఈ కేసులో నిందితుడిగా బీజేపీ నేత పేరు వినపడటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధితురాలు నాలుగు ఏళ్ల క్రితం బాల్టోరాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. బాధితురాలి ఇంటికి కాంటిలాల్‌ అనే బీజేపీ కౌన్సిలర్‌ తరచు వచ్చేవాడు. ఈ క్రమంలో స్నానం చేస్తున్నప్పుడు తనను వీడియో తీశాడు. దాంతో బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని, అంతేగాక అతని స్నేహితుడు జోధ్రామ్ తో కూడా సహజీవనం చేయాలని బలవంతం చేశాడు. 

ఈ మేరకు బాధఙతురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోను వైరల్‌ చేస్తానని బెదిరించి బాధితురాలిపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని డీఎస్పీ సుభాష్ ఖోజా పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు పేర్కొన్నారు.