Asianet News TeluguAsianet News Telugu

ఆటోలో పోగొట్టుకున్నాడు.. వాట్సప్ తో దొరికించుకున్నాడు.. నగల వ్యాపారి మామూలోడు కాదు..

నగలు తీసుకున్నవారు వాటిని నగలు కుదువపెట్టే దుకాణాల్లో విక్రయించే అవకాశం ఉందని గ్రహించిన మహిపాల్.. నగరం చుట్టుపక్కల జిల్లాలోని నగల దుకాణాల యజమానులకు వాట్సాప్ ద్వారా నగల వివరాలు, ఫోటోలు పంపించి, సమాచారం తెలిస్తే ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో, పురుషవాక్కం షణ్ముగరాయర్ రోడ్డులోని ఓ నగలు కుదువ పెట్టే దుకాణానికి వెళ్లిన రమేష్ అనే వ్యక్తి కొన్ని నగలు విక్రయించేందుకు యత్నించాడు.

man lost 365 grams gold in auto journey recovery by whatsapp message in tamilnadu
Author
Hyderabad, First Published Jan 25, 2022, 1:31 PM IST

చెన్నై : అదృష్టవంతుడిని చెడగొట్టలేరు అని పెద్దలు చెబుతుంటారు. ఓ చెన్నై వ్యాపారి విషయంలో ఇది అక్షరాలా నిజం అయ్యింది. పోగొట్టుకున్న Jewelryను వాట్సాప్ గ్రూప్ ద్వారా ఓ వ్యాపారి తిరిగి పొందిన ఘటన Chennai నగరంలో చోటు చేసుకుంది. స్థానిక వెప్పేరికి చెందిన నగల వ్యాపారి మహిపాల్ ఈ నెల 17న  ఆటోలో Central Railway Stationకు వెళ్ళాడు. అక్కడ దిగిన తర్వాత తన ప్యాంటు జేబులో పెట్టుకున్న 365 గ్రాముల నగలు కనిపించకపోవడంతో పెరియమేడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ చేపట్టారు.  

ఈ నేపథ్యంలో, నగలు తీసుకున్నవారు వాటిని నగలు కుదువపెట్టే దుకాణాల్లో విక్రయించే అవకాశం ఉందని గ్రహించిన మహిపాల్.. నగరం చుట్టుపక్కల జిల్లాలోని నగల దుకాణాల యజమానులకు వాట్సాప్ ద్వారా నగల వివరాలు, ఫోటోలు పంపించి, సమాచారం తెలిస్తే ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో, పురుషవాక్కం షణ్ముగరాయర్ రోడ్డులోని ఓ నగలు కుదువ పెట్టే దుకాణానికి వెళ్లిన రమేష్ అనే వ్యక్తి కొన్ని నగలు విక్రయించేందుకు యత్నించాడు.

వీటిని పరిశీలించిన యజమాని.. వాట్సప్లో మహిపాల్ పంపిన నగలుగా గుర్తించి అతడికి సమాచారం అందించాడు. మహిపాల్, పెరియమేడు పోలీసులు దుకాణం వద్దకు చేరుకుని రమేష్ ను అదుపులోకి తీసుకుని  విచారించగా రోడ్డు పక్కనదొరికిన నగలు అని.. అవి తన సోదరి జ్యోతి , సోదరి కుమార్తె భాగాలుగా పంచుకున్నారని రమేష్ పేర్కొన్నాడు. దీంతో రమేష్,  జ్యోతి, సహా నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, గత డిసెంబర్ లో ఇలాంటి ఘటనే తమిళనాడులోనే చోటు చేసుకుంది.  tamilnaduలో ఓ వ్యక్తి ఇంట్లో సోమవారం 687 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన policeలు చోరీ చేసేందుకు తలుపులు పగలగొట్టిన iron rad ఉపయోగించినట్లు నిర్ధారించారు. ఇనుప రాడ్ ను దొంగలు  wellలో పడేసి ఉండవచ్చని అది దొరికితే విచారణ సులభమవుతుందని.. పోలీసులు దాని కోసం గాలించమని బాధితులకు సలహా ఇచ్చారు.  దీంతో ఇనుప రాడ్  కోసం గాలించిన  బాధితులకు పోయిన బంగారు నగలు బావిలో లభించడం ఆశ్చర్యకరంగా మారింది. 

వివరాల్లోకి వెడితే.. గోపాల పట్టినం  నడువీధిలో  జగుబర్ సాదిక్ (55) అనే పారిశ్రామికవేత్తకు చెందిన విలాసవంతమైన నివాసగృహం ఉంది. సాదిక్ బ్రూనేలో సూపర్ మార్కెట్లు నడుపుతున్నాడు. తరచూ స్వస్థలానికి వచ్చి ఆ ఇంట్లో ఉండి వెడుతూ ఉండేవాడు. గత ఏడాది నుంచి కరోనా లాక్డౌన్ కారణంగా ఆయన స్వస్థలానికి రాలేదు. ఆయన సోదరి కుటుంబీకులు నివాస గృహాన్ని తరచూ శుభ్రం చేసి  తాళం వేసేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీ రాత్రి వ్యక్తులు 687 సవర్ల నగలు దోచుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం సాదిక్ సోదరి కుమార్తె ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. 

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిచ్చిన సలహాతో పోయిన నగలు దొరకడంతో వారు ఆనందంలో మునిగిపోయారు. పుదుక్కోటై  జిల్లా గోపాలపట్నం గ్రామంలో  జవహర్ అనే వ్యక్తి ఇంట్లో బంగారం చోరీ జరిగింది. ఇంటి వెనక తలుపులు పగలగొట్టి మేడపై స్టోర్ రూమ్ లో ఉంచిన 687 సవర్ల నగలు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios