ఓ వ్యక్తి తన లవర్‌ను ఓయో హోటల్‌కు రమ్మన్నాడు. మరో వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నదనే అనుమానంతో తాడుతో ఉరేసి చంపేశాడు. ఢిల్లీ పక్కనే ఉండే ఫరీదాబాద్‌లోని ఓయో హోటల్‌లో ఈ రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. 

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి తన లవర్‌ను ఓయో హోటల్‌కు రమ్మన్నాడు. ఆమె వచ్చింది. హోటల్‌లో వారి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమెను తాడుతో ఉరేసి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో ఉండే ఓ ఓయో హోటల్‌లో ఈ రోజు చోటుచేసుకుంది.

24 ఏళ్ల ఆకాశ్ ఢిల్లీలోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఆమె 8 ఏళ్లుగా పరిచయం. అయితే, ఇటీవలి కాలంలో ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని, మాట్లాడుతున్నదని అనుమానించాడు. ఆమెను ఫరీదాబాద్‌లోని ఎన్‌హెచ్‌పీసీ చౌక్ సమీపంలోని ఓయో హోటల్‌కు రమ్మన్నాడు. ఆమె వెళ్లింది. 

హోటల్‌కు వచ్చిన తర్వాత ఆమెను అనుమానిస్తూ కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అనంతరం, ఆమెను తాడుతో ఉరి తీశాడు. చంపేశాడని పోలీసులు తెలిపారు.

Also Read: ముస్లిం యువతితో లవ్.. యువకుడి క్రూర హత్య.. ముక్కలుగా నరికేసిన ఆమె సోదరులు!

ఆ వ్యక్తిని అదే హోటల్‌ నుంచి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. ఆమెను చంపడానికి ఉపయోగించిన తాడును పోలీసులు ఆ హోటల్ గది నుంచి రికవరీ చేసుకున్నారు. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హిందు యువకుడు, ముస్లిం యువతి ప్రేమించుకున్నారు. కానీ, ముస్లిం యువతి కుటుంబానికి వీరి మధ్య సంబంధం అస్సలే ఇష్టం లేదు. పలుమార్లు హెచ్చరించారు కూడా. కానీ, వారు తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో జూన్ 6వ తేదీ నుంచి ఆ యువకుడు కనిపించలేదు. ఆ తర్వాత మూడు రోజులకు అతని బాడీ ముక్కలై మున్సిపాలిటీ చెత్తలో కనిపించింది.