నిరాశ్రయురాలైన ఓ మహిళ ను ఓ వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రం  హస్సన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హస్సన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కనీసం ఉండటానికి ఇళ్లు కూడా లేదు. రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై జీవిస్తోంది.

కాగా.. ఆమెపై ఓ దుర్మార్గుడు కన్నేశాడు. ఆమె నిద్రపోతుండగా.. ఓ సిమెంట్ బ్లాక్ తీసుకొని ఆమె తలపై కొట్టాడు. దీంతో.. తీవ్రగాయమై సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా.. సదరు మహిళ ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ ఘటనంతా సమీపంలోని ఓ సీసీకెమేరాలో రికార్డు అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.