తన కన్న కొడుకుకి స్నేహితుడు.. దాదాపు ఆమె కు కూడా కొడుకు లాంటివాడే.. అలాంటి కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ యువకుడిని రెచ్చగొట్టి.. మరీ తనవైపు తిప్పుకుంది. తీరా.. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో.. కథ అంతా రివర్స్ అయ్యింది. ఆమెను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్‌కోవిల్ పట్ణణంలోని ఆచారిపల్లెంకు చెందిన దంపతులకు పంతొమ్మిదేళ్ళ కుమారుడున్నాడు. భర్త వడ్రంగి వ్యాపారం చేస్తుంటాడు. జల్సాలకు అలవాటుపడ్డ అతని భార్య... తన కుమారునితో వచ్చే యువకుడిపై మనసుపడింది. ఈ క్రమంలో... ఆ అబ్బాయిని రెచ్చగొట్టి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అతడి ఖర్చులకు డబ్బులు ఇస్తూ మరీ తన కోర్కెలు తీర్చుకునేది. కాగా... ఆ అబ్బాయి... ఎప్పుడుపడితే అప్పుడు వచ్చి వెళుతున్నాడని ఇంటిపక్కన వారు ఆమె భర్తకు ఫిర్యాదు చేశారు.

ఓ రోజు పని మీద బయటకు వెళ్లిన భర్త ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి రాగా బెడ్‌రూంలో భార్య ఒంటిపై నూలు పోగు లేకుండా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండడం చూసి నిర్ఘాంతపోయాడు. ఆ క్రమంలోనే... ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ప్రియుడు కూడా నగ్నంగా ఉండి బయటకు పరుగులు తీశాడు. అతడిపై దాడి చేయగా తప్పించుకున్నాడు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.