Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి వల.. నకిలీ ప్రొఫైల్ లతో 12 మంది అమ్మాయిలకు ఇంజనీర్ లైంగిక వేధింపులు..

మ్యాట్రిమోనియల్ సైట్ లను ఉపయోగించి పెళ్లి పేరిట యువతులను ఆకర్షించి వారిన లైంగికంగా వేధించిన మెకానికల్ ఇంజినీరును ముంబై పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. 

Man held for sexually assaulting 12 women, used matrimonial sites to lure them - bsb
Author
Hyderabad, First Published Jun 8, 2021, 11:02 AM IST

మ్యాట్రిమోనియల్ సైట్ లను ఉపయోగించి పెళ్లి పేరిట యువతులను ఆకర్షించి వారిన లైంగికంగా వేధించిన మెకానికల్ ఇంజినీరును ముంబై పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. 

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 12 మంది యువతులను లైంగికంగా వేదించిన మహేష్ అలియాస్ కరణ్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన మహేష్ ఉన్నత విద్యావంతులైన యువతులను ఆకర్షించేందుకు మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ లను సృష్టించాడు. 

మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా యువతులతో సన్నిహితంగా మెలుగుతూ వారిని ఫోన్లలో సంప్రదించి పబ్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లలో సమావేశం అయ్యేవాడు. ఈ టైంలోనే యువతులను లైంగికంగా వేధించాడని డిప్యూటీ పోలీసు కమిషనర్ సురేష్ మెన్ గేడ్ తెలిపారు. ప్రతీ నేరానికి కొత్త మొబైల్ నెంబర్ వాడేవాడు.

ప్రతీసారి తన సిమ్ ను మార్చుకుంటూ ఓలా లేదా ఉబర్ ఉపయోగించి క్యాబ్రెడ్లను బుక్ చేసేవాడు. గతంలో హ్యాకర్ గా పనిచేసిన మహేష్ కంప్యూటర్లమీద మంచి పరిజ్ఞానం ఉంది. పెద్ద కంపెనీల్లో పనిచేసిన మహేష్ 12 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. నిందితుడిని అరెస్ట చేసి రిమాండ్ కు తరలించామని డీసీపీ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios